ఇండియా, చైనా కార్లంటే నచ్చని అమెరికన్లు: స్టడీ

అయితే, తాజాగా వెల్లడైన అధ్యయనం ప్రకారం అమెరికన్లకు ఇండియన్ కార్లంటే పెద్దగా నచ్చడం లేదని తేలింది. ప్రముఖ మార్కెట్ రీసెర్చ్ సంస్థ జిఎఫ్‌కె ఆటోమోటివ్ వెల్లడించిన తాజా అధ్యయనం ప్రకారం, మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ చైనా కార్లను కొనుగోలు చేయాడానికి చాలా మంది అమెరికన్లు సిద్ధంగా లేరని పేర్కొంది.
వివిధ వయో గ్రూపులపై జరిపిన ఈ అధ్యయనంలో 38 శాతం మంది చైనా కార్లను కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతుండగా, 30 శాతం మంది మాత్రమే ఇండియా కార్లను కొనుగోలు చేసేందుకు ఉత్సాహం చూపుతున్నట్లు తేలింది. కాగా.. 95 శాతం మంది అమెరికన్లు తమ దేశంలో తయారయ్యే వాహనాలను కొనుగోలు చేసేందుకు మక్కువ చూపుతున్నట్లు తేలింది.
అలాగే, 76 శాతం మంది అమెరికన్లు జర్మనీ కార్లను, 75 శాతం మంది జపాన్ కార్లను మరియు 49 శాతం మంది అమెరికన్లు కొరియన్ కార్లపై ఆసక్తి చూపుతున్నట్లు జిఎఫ్‌కె పేర్కొంది. అమెరికాలో తొలులు కొరియన్ కార్ల కంపెనీలైన హ్యుందాయ్, కియాలు కూడా ఇదేవిధమైన పరిస్థితిని ఎదుర్కున్నాయని, 15 ఏళ్ల సుదీర్ఘ ప్రయత్నాల తర్వాత ఈ రెండు కంపెనీలు మంచి పేరును తెచ్చుకున్నాయని, చైనా మరియు ఇండియా కార్ల విషయంలో కూడా ఇదే విధంగా జరుగుతోందని జిఎఫ్‌కే తన అధ్యయనంలో వెల్లడించింది.


Click it and Unblock the Notifications








