నాసిల్ బోర్డుకు రాజీనామాను అభ్యర్థించిన ఆనంద్ మహీంద్రా

గతేడాది మార్చి నెలలో మహీంద్రాతో పాటు ఎయిర్ చీఫ్ మార్షల్ ఫాలీ హెచ్ మేజర్ (రిటైర్డ్), ఫిక్కీ కార్యదర్శి జనరల్ అమిత్ మిత్రా, అంబుజా రియాల్టీ గ్రూపు చైర్మన్ హర్ష్ నియోటితాలు నాసిల్ బోర్డులో స్వతంత్ర (ఇండిపెండెంట్) డైరెక్టర్లుగా చేరిన సంగతి తెలిసిందే. మహీంద్రా అండ్ మహీంద్రా ఎయిరోస్పేస్ వ్యాపారంలో కూడా అడుగుపెట్టింది ఆస్ట్రేలియాకు చెందిన ఎయిరోస్టాఫ్ ఆస్ట్రేలియా, గిప్స్ ల్యాండ్ ఎయిరోనాటిక్స్‌లో 75.1 శాతం వాటాను కైవసం చేసుకుంది. దీని కోసం రూ.175 కోట్లు పెట్టుబడులు పెట్టింది.
ఎయిర్‌క్రాఫ్ట్ పరికరాలను తయారు చేసి అంతార్జాతీయ మార్కెట్ లో విడుదల చేయాలని మహీంద్రా భావిస్తుంది. ఇందుకోసం అంతర్జాతీయ ఏరోస్పేస్ కార్పొరేషన్లలో మహీంద్రా గ్రూప్ జరిపిన చర్చలు విజయవంతమయ్యాయని, ఎయిర్ ఇండియాకు విమానాలు సరఫరా చేస్తున్న సంస్థలకు విడిభాగాలను అందించే కాంట్రాక్టులను దక్కించుకున్నామని మహీంద్రా అధికారి ఒకరు వెల్లడించారు. బహుశా ఈ కారణాల వల్లే ఆనంద్ మహీంద్రా తన రాజీనామా ప్రతిపాదన తీసుకువచ్చి ఉండవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.


Click it and Unblock the Notifications








