నాసిల్ బోర్డుకు ఆనంద్ మహీంద్రా రాజీనామా ఆమోదం

Anand Mahindra
భారత ఆటో దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ వైస్-చైర్మన్ ఆనంద్ మహీంద్రా నేషనల్‌ ఏవియేషన్‌ కంపెనీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (నాసిల్‌) బోర్డుకు సమర్పించిన రాజీనామాను ఎట్టకేలకు ప్రభుత్వం ఆమోదించింది. గత నెలలో ఎయిర్‌ ఇండియా బోర్డు స్వతంత్ర డైరెక్టర్‌ పదవి నుంచి తప్పుకునేందుకు రాజీనామా పత్రాన్ని కేంద్ర పౌరవిమాన యాన శాఖ మంత్రి వాయిలార్‌ రవికి ఆనంద్ మహీంద్రా అందజేసిన సంగతి తెలిసిందే.

గతేడాది మార్చి నెలలో ఆనంద్ మహీంద్రాతో పాటు ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఫాలీ హెచ్‌ మేజర్‌ (రిటైర్డ్‌), ఫిక్కీ కార్యదర్శి జనరల్‌ అమిత్‌ మిత్రా, అంబుజా రియాల్టీ గ్రూపు చైర్మన్‌ హర్ష్‌ నియోటితాలు నాసిల్ బోర్డులో స్వతంత్ర (ఇండిపెండెంట్‌) డైరెక్టర్లుగా చేరారు. ఇటీవల బెంగళూరులో ముగిసిన ఏరో-ఇండియా 2011లో తమ సంస్థ అపార వ్యాపార అవకాశాలను చేజిక్కుంచుకోనుందని, అంతేకాకుండా.. తమ సంస్థ ఏరో స్పేర్స్ వ్యాపారంలో కూడా అడుగుపెట్టిందని, ఇలాంటి పరిస్థితుల్లో తాను బోర్డులో కొనసాగడం నైతికత కాదని భావిస్తున్నానని, అందుకే తాను బోర్డుకు రాజీనామా చేసేందుకు అంగీకరించాలని ఆనంద్ మహీంద్రా తన రాజీనామా లేఖలో కోరారు.

ఈ మేరకు ఆనంద్ మహీంద్రా సమర్పించిన రాజీనామాను ఆమోదిస్తున్నట్లు ఎయిర్ ఇండియా ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఇటీవల హీంద్రా అండ్‌ మహీంద్రా ఎయిరోస్పేస్‌ వ్యాపారంలో కూడా అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాకు చెందిన ఎయిరోస్టాఫ్‌ ఆస్ట్రేలియా, గిప్స్‌ ల్యాండ్‌ ఎయిరోనాటిక్స్‌లో కంపెనీ 75.1 శాతం వాటా రూ.175 కోట్లతో కొనుగోలు చేసింది.

More from DriveSpark

Article Published On: Monday, March 28, 2011, 10:27 [IST]
English summary
Mahindra & Mahindra Vice-Chairman Anand Mahindra's resignation as an independent director on Air India's board of directors has been accepted, official sources said. Last month Mahindra offered to resign from the board of NACIL that runs state-owned carrier Air India, citing conflict of interest.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+