వెహికల్‌కి 15 సంవత్సరాలు దాటితే హరిత పన్ను

రాష్ట్రంలో గత ఏప్రిల్ నాటికి వాహనాల సంఖ్య 1.3 కోట్లకు చేరుకుంది. ఈ నేపథ్యంలో పాత వాహనాలను రోడ్డెక్కకుండా కట్టడి చేస్తే చాలా వరకు కాలుష్యాన్ని నిరోధించవచ్చని అధికారులు భావిస్తున్నారు. దీంతో హరిత పన్నును రెట్టింపు చేయాలని నిర్ణయించారు. ఏడేళ్లు దాటిన రవాణా వాహనాలకు ఏడాదికి రూ.200 వరకు ఉండేది. ఇప్పుడు రవాణా వాహనాలను రెండు విభాగాలుగా విభజించారు.
ఆటోలు ఇతర చిన్న ట్రాలీలకు ఏడాదికి రూ.250లను హరిత పన్ను కింద వసూలు చేయాలని నిర్ణయించారు. లారీలకు ఇతర రవాణా వాహనాలపై భారీగా పెంచారు. ఏడాదికి వీటిపై రూ.1000 వసూలు చేయాలని ప్రతిపాదించారు. 15 ఏళ్లు దాటిన ద్విచక్ర మోటారు సైకిల్‌పై ప్రస్తుతం రూ.50 పన్ను విధిస్తుండగా.. ఇప్పుడు దాన్ని రూ.150 నుంచి రూ.200 వరకు వసూలు చేయాలని నిర్ణయించారు. సొంత కార్లకు ఇప్పుడు రూ.100 వసూలు చేస్తుండగా ఇక నుంచి రూ.400 వరకు వసూలు చేయాలని ప్రతిపాదించారు.
వీటికితోడు వాహన వయస్సు పెరుగుతున్న కొద్దీ హరిత పన్నును భారీగా పెంచే ఆలోచన కూడా చేస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. పాత వాహనాలను మూలనపడేలా చేయడం కోసం ఇదంతా చేస్తున్నామని చెబుతున్నా హరిత పన్ను వల్ల రవాణా శాఖకు రూ.20 కోట్ల వరకు ఆదాయం సమకూరే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








