టాటా నానోనే కాదు ఫెరారీ కూడా బర్నింగ్ కారే..

సాధారణంగా కొత్త కార్లు బ్రేక్‌డౌన్ కావడానికి, లోపం ఉండటానికి అవకాశాలు చాలా ఎక్కువ. అయితే, అత్యంత శ్రద్ధతో రూపొందించే ఇటువంటి ఖరీదైన కార్లు ఉన్నట్టుండి అగ్నిగోళాల్లా మారడం ఫెరారీ అభిమానులను విస్మయానికి గురి చేసింది. 44 ఏళ్ల వయస్సున్న ఓ వ్యక్తి ఈ ఫెరారీ కారును టెస్ట్ డ్రైవ్ నిమిత్తం తీసుకువెళ్లగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
అయితే, ఈ అగ్ని ప్రమాదం ఎలా సంభవించిందో వివరించేందుకు మాత్రం ఆయన నిరాకరించినట్లు జర్మన్ మీడియా పేర్కొంది. అయితే, ఇలా ఓ ఫెరారీలో మంటల్లో చెలరేగడం ఇదేం మొదటిసారి కాదు. 458 ఇటాలియా కారును విడుదల చేసిన మూడు నెలల్లోనే ఇలాంటివి ఐదు సంఘటనలు చోటుచేసుకున్నాయి. నెదర్లాండ్స్‌లో గేర్‌బాక్స్ లోపం కారణంగా ఓ ఫెరారీ ఎఫ్ఎఫ్ కారు బ్రేక్‌డౌన్‌కు గురైంది.
ఫెరారీ ఇటీవలే తమ తొలి ఫోర్-వీల్ డ్రైవ్ "ఫెరారీ ఎఫ్ఎఫ్" స్పోర్ట్స్ కారును భారత మార్కెట్లో విడుదల చేసింది. భారత్‌లో అమ్ముడవుతుతున్న అత్యంత ఖరీదైన కార్లలో ఫెరారీ ఎఫ్ఎఫ్ కూడా ఒకటి. దేశీయ విపణిలో దీని ధర రూ.3.5 కోట్లు. ఫెరారీ ఎఫ్ఎఫ్ 6-లీటర్ వీ12 ఇంజన్‌తో 660 బిహెచ్‌పిల శక్తిని, 683 ఎన్‌ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది కేవలం 3.7 సెకండ్లలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.


Click it and Unblock the Notifications








