ఆనంద్‌లో అగ్నికి ఆహుతైన మరో బుజ్జి కారు

ఈ కారులో హఫ్సా భర్తతో పాటు తన నలుగురు స్నేహితులు ప్రయాణిస్తున్నారని, క్రిష్ణా రోడ్డును చేరుకోగానే కారులో పొగ రావాడాన్ని వారు గమనించి, కారును రోడ్డు పక్కనే పార్క్ చేసి వారు బయటకు వచ్చేశారని, అనంతరంలో అందులో మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు. అయితే, ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించిన అసలు కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. కంపెనీ కూడా ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
గతంలో ఇలానే పలు టాటా నానో కార్లు మంటల్లో చెలరేగిన నేపథ్యంలో నానో ప్రాజెక్ట్ టీమ్, ఇంజనీరింగ్ రీసెర్చ్ సెంటర్ టీమ్, యూరప్ నుంచి వచ్చిన సాంకేతిక బృందం మరియు టాటా మోటార్స్ బ్రిటన్ యూనిట్ అయిన జాగ్వార్ అండ్ లాండ్ రోవర్ పరిశోధక బృందాలు కలసి నానోను పూర్తిగా పరిశీలించి ఇది పూర్తి సురక్షితంగా ఉన్నట్లు క్లీన్‌చిట్ ఇచ్చారు.
గత నెలలో గుజరాత్‌లోని సనంద్ ప్లాంటులో సుమారు 15 రోజుల పాటు టాటా నానో కారు ఉత్పత్తిని నిలిపివేయడంతో ఆగస్టు నెలలో విక్రయాలు భారీగా పడిపోయాయి. ఆగస్టు 2011 నెలలో భారత్‌లో కేవలం 1,202 కార్లు మాత్రమే అమ్ముడుపోయాయి. తాజా టాటా నానో అగ్ని ప్రమాద సంఘటన ఈ మోడల్ అమ్మకాలపై ప్రభావం చూపే ఆస్కారం ఉందని విమర్శకులు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications








