ఢిల్లీలో కాలి బూడిదైన మరో టాటా నానో కారు!

ఓ టాటా నానో కారులో నిశాంత్ (25 ఏళ్లు) అనే విద్యార్థి, అతని అక్క సుమ (35 ఏళ్లు)లు క్రిష్ణా నగర్‌లోని తమ నివాసం నుంచి కన్నాట్ ప్లేస్‌కు వెళ్తుండగా ఈ సంఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వీరిరువురూ కారులో వెళ్తుండగా పొగరావడాన్ని గమనించి వెంటనే కారును వదిలిపెట్టి బయటకు వచ్చారని, వారు బయటకు వచ్చిన 15 నిమిషాల్లో కారులో మంటలు చెలరేగాయని పోలీసులు తెలిపారు. కాగా.. ఈ ఒక్క నెలలోనే ఇలా టాటా నానో కారు మంటల్లో చిక్కుకోవడం ఇది నాలుగో సంఘటన. ఇదివరకే గుజరాత్, శ్రీలంక మరియు చెన్నై నగరాల్లో మూడు నానో కార్లు అగ్నికి ఆహుతి అయ్యాయి.


Click it and Unblock the Notifications