చెన్నైలో చిచ్చుబడ్డిలా అంటుకున్న మరో టాటా నానో కారు!

Tata Nano
పాపం టాటా మోటార్స్ ప్రజల కారు టాటా నానోకు నిజంగానే సెప్టెంబర్ నెల అసలు కలిసి రావడం లేదు ఈ నెలలో ఇప్పటి వరకూ టాటా నానో కార్లు అగ్నికి ఆహుతైన సంఘటనల గురించిన ఇదివరకే మనం తెలుసుకున్నాం. గుజరాత్‌లోని ఆనంద్‌లో మరియు శ్రీలంలోని లేడెన్ బస్టియన్ మవాతా, ఫోర్ట్ సమీపంలో మంటల్లో కాలిపోయిన సంఘటనల గురించి వన్ఇండియా ఆటోమొబైల్ ఇటీవలి కథనాల్లో ప్రచురించింది. అయితే, తాజాగా.. ఇలాంటిదే మరో సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

కాగా.. ఈసారి టాటా నానో అగ్ని ప్రమాద సంఘటన తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో చోటుచేసుకున్నట్లు తెలుస్తుంది. సెప్టెంబర్ నాలుగో తేదీన చెన్నైలో ఓ కొత్త టాటా నానో కారులో ఉన్నట్లుండి మంటలు అంటుకోవడాన్ని ఓ యూట్యూబ్ యూజర్ తన మొబైల్ ఫోన్‌లో వీడియో తీసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాడు. అయితే, దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను మాత్రం సదరు యూజర్ పంచుకోలేదు. ఈ వీడియోలో కాలిపోతున్న టాటా నానో కారును రిజిస్ట్రేషన్ నెంబర్‌ను తమిళనాడుకు చెంది ఉంది.

ప్రస్తుతం యూట్యూబ్‌లో ఇదే హాట్ వీడియోగా ఉంది. ఇప్పటి వరకూ ఉత్తర భారతదేశంలో అధికంగా టాటా నానో కార్లలో మంటలు చెలరేగిన సంఘటనలను మన గమనించాం. అయితే, దక్షిణ భారతదేశంలో ఇలా టాటా నానో కారు అగ్నిసమర్పణం కావండ ఇదే మొదటిసారి. ఏదేమైనప్పటికీ సంఘటనలపై టాటా మోటార్స్ ఇంత వరకూ ఎలాంటి ప్రకటనలు చేయలేదు.

ఈ తాజా సంఘటనతో ఒక్క సెప్టెంబర్ నెలలోనే అగ్నికి ఆహుతైన టాటా నానో కార్ల సంఖ్య మూడుకు చేరింది. ఇప్పటి వరకూ సుమారు 10కి పైగా నానో కార్లు ఇలా మంటల్లో చిక్కుకున్నాయి. అసలే మందగించిన అమ్మకాలతో సతమతవుతున్న టాటా నానోకు తాజా సంఘటనలు మరింత ప్రభావాన్ని చూపే ఆస్కారం ఉందని విమర్శకులు భావిస్తున్నారు.

More from DriveSpark

Article Published On: Friday, September 9, 2011, 8:43 [IST]
English summary
Another Tata Nano is reported to have caught fire in Chennai, Tamil Nadu on 4th September. A video in Youtube is showing a new Tata Nano car bearing the TN registration number reportedly caught fire. Similar cases were reported in Gujarat and Sri Lanka recently. However no official word came out from the company side.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+