వ్యాగన్ఆర్ థింక్ బిగ్ ఛాలెంజ్-2 టైటిల్‌ను గెలుచుకున్న జైపూర్ మహిళ

Aparna Bhatnagar
వ్యాపారం ప్రారంభించాలనే ఆలోచనలు ఉండీ వాటిని ఆచరణలోకి తీసుకురావడం ఎలాగో తెలియని ఔత్సాహికులకు అవకాశాలను ప్రసాదించే ఆశయంతో.. దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా (ఎమ్ఎస్ఐ) నిర్వహించిన 'థింక్ బిగ్ ఛాలెంజ్ 2' విజేతలను కంపెనీ ప్రకటించి వారికి కానుకలు అందజేసింది. ఈ పోటీలో జైపూర్‌కు చెందిన ఓ మహిళా వ్యాపారవేత్త అపర్నా భట్నాగర్ విజేతగా నిలిచారు. ఈ టైటిల్‌ను సొంతం చేసుకున్న అపర్నా భట్నాగర్‌కు మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ (ఎమ్ఎస్ఐఎల్) కంపెనీ రూ. 10 లక్షల నగదు బహుమతి, వెంచర్ క్యాపిటల్‌తో పాటుగా ఓ వ్యాగన్ఆర్ కారును బహుమతిగా అందించింది. వ్యాగన్ఆర్ కారు తాళం చెవులను, ఆ కారుకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న తమిళ స్టార్ హీరో ఆర్ మాధవన్ చేతుల మీదుగా ఆమెకు అందజేశారు.

ఈ పోటీలో పాల్గొన్న అపర్నా భట్నాగర్ 'గ్రీన్అండ్‌గుడ్‌స్టోర్ డాట్ కామ్' అనే ఓ ఆన్‌లైన్ స్టోర్‌ను నిర్వహిస్తున్నారు. ఈ ఆన్‌లైన్ స్టోర్ ద్వారా పర్యావరణానికి హాని కలిగించని ఉత్పత్తులును విక్రయించడమే కాకుండా.. పర్యావరణం పట్ల ప్రజలలో అవగాహనను మరియు ప్రపంచంలో సామాజిక మార్పును తీకురావాడమే దీని కాన్సెప్ట్. 19 నగరాల్లో దాదాపు నాలుగున్నరేళ్లపాటు సాగిన ఈ పోటీలో నార్త్‌ జోన్‌లో ఛండీఘర్‌కు చెందిన సునీల్‌ గుప్తా, ఈస్ట్‌జోన్‌లో గౌహతికి చెందిన సరఫరాజ్‌ హుస్సేన్‌, వెస్ట్‌ జోన్‌లో జైపూర్‌కు చెందిన అపర్నా భట్నాగర్‌, సౌత్‌ జోన్‌లో చెన్నైకు చెందిన విజయన్‌ తిరుమలైలు టాప్‌ ఫోర్‌ ర్యాంక్‌లలో నిలిచారు.

More from DriveSpark

Article Published On: Monday, May 30, 2011, 12:54 [IST]
English summary
Aparna Bhatnagar, a Jaipur based woman entrepreneur has won the WagonR Think Big Challenge-II with her business idea 'The Green and Good Store', an online store that sells products which bring about positive environmental and social change in the world. The winnertook away the cash prize of Rs 10 lakh along with the keys of a Wagon R, which was presented by the car's brand ambassador R Madhavan.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+