మార్కెట్లోకి ఆపె మినీ ట్రక్‌ను విడుదల చేసిన పియాగ్గియో

Ape Mini
దేశీయ ఆటోమొబైల్ రంగంలో ఉన్న వివిధ విభాగాలలో వాణిజ్య వాహన విభాగం కూడా ఒక కీలకమైన విభాగం. ఈ విభాగంలో ఇప్పటికే పలు ఆటోమొబైల్ కంపెనీలు వినియోగదారుల అవసరాల మేరకు తమ ఉత్పత్తులను మార్కెట్లో ప్రవేశపెడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా.. ప్రస్తుతం మినీ ట్రక్‌లో విభాగంలో అగ్రగామిగా ఉన్న పియాగ్గియో సంస్థ అర టన్ను బరువు లాగే సామర్ధ్యం కలిగిన "ఆపె మినీ ట్రక్‌"ను విడుదల చేసింది. నాలుగు చక్రాలు కలిగిన ఈ మినీ ట్రక్ ధర రూ. 1,73,600గా ఉన్నట్లు కంపెనీ పేర్కొంది.

చిన్నతరహా వ్యాపారస్తులకు ఆపె మినీ చక్కగా సరిపోతుందని, ఈ విభాగంలో ఇది సరికొత్త రికార్డులను నెలకొల్పగలదని కంపెనీ డైరెక్టర్ (సేల్స్, మార్కెటింగ్ విభాగం) అసుతోష్‌ ఖోస్లా ధీమా వ్యక్తం చేశారు. 2010లో పియోగ్గియో 4.5 లక్షల యూనిట్లను విక్రయించగా అందులో 1.96 లక్షలు త్రిచక్ర వాహనాలే ఉన్నట్లు ఆయన వివరించారు. మహారాష్ట్రలో ఉన్న పియోగ్గియో ఉత్పత్తి కేంద్రలో సాలీన రెండు లక్షల త్రిచక్ర వాహనాలను, ఒక లక్ష నాలుగు చక్రాలన వాహనాలను ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉందని ఆయన తెలిపారు.

దేశంలో విస్తరిస్తున్న రవాణా వ్యవస్థ కారణంగా.. పెరుగుతున్న ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకొని ఈ మీనీ ట్రక్‌లను రూపొందించామని, చిన్న చిన్న రవాణా అవసరాలకు పెద్ద వాణిజ్య వాహనాలను వాడటానికి బదులు ఇటువంటి వాటిని ఉపయోగించడం వల్ల ట్రాఫిక్ సమస్య తగ్గుతుందని ఖోస్లా తెలిపారు. గత 2010లో అరటన్ను, టన్ను విభాగాల ట్రక్కుల విక్రయాలు 1.8 లక్షలుగా ఉంది. ఈ కొత్త మోడల్ నాలుగు చక్రాల కార్గో వాహనం లీటర్ డీజిల్‌కు 29 కిలోమీటర్లు మైలేజీ ఇస్తుందని ఆయన తెలిపారు.

More from DriveSpark

Article Published On: Thursday, February 17, 2011, 13:11 [IST]
English summary
The auto industry’s different segment of trucks and tractors is running in a rough track with sale reaching new horizons. The companies are wooing the right customers in this segment with compact size vehicles.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+