తొలి త్రైమాసికంలో 4 శాతం పెరిగిన అపోలో టైర్స్ లాభం

Apollo Tyres
పెరిగిన ముడిసరుకులు ధరల కాఱణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దాదాపు అన్ని టైర్ల కంపెనీలు నష్టాలను ప్రకటిస్తుండగా.. ప్రముఖ టైర్ల తయారీ సంస్థ అపోలో టైర్స్ మాత్రం స్వల్పంగా వృద్ధిని నమోదు చేసుకుంది. 2011-12 ఆర్థిక సంవత్సరంలో జులై 30తో ముగిసిన తొలి త్రైమాసికంలో కంపెనీ నికర లాభం 4 శాతం వృద్ధి చెంది రూ. 77 కోట్లుగా నమోదైంది గతేడాది ఇదే సమయంకో కంపెనీ నికర లాభం రూ. 74 కోట్లుగా ఉన్నట్లు అపోలో టైర్స్ పేర్కొంది.

ఈ త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ నికర అమ్మకాలు 55 శాతం వృద్ధి చెంది రూ. 1,820 కోట్ల నుండి రూ. 2,822 కోట్లకు పెరిగాయి. కాగా.. దేశీయ టైర్ పరిశ్రమ ఎదుర్కుంటున్న సహజ రబ్బరు (న్యాచురల్ రబ్బర్) కొరత సమస్యను దృష్టిలో ఉంచుకొని అపోలో టైర్స్ రబ్బర్ ప్లాంటేషన్‌ను చేపట్టేందుకు లావోస్ ప్రాంతంలో 10,000 హెక్టార్ల భూమిని లీజ్‌కు తీసుకోనున్నట్లు ప్రకటించింది.

Most Read Articles

English summary
Leading tyre maker Apollo Tyres posted 4% growth in consolidated net profit to Rs 77 crore for the quarter ended June 30, 2011, vis-a-vis the same period last fiscal.
Story first published: Thursday, August 11, 2011, 16:21 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X