మా సామ్రాజ్యాన్ని మిడిల్ ఈస్ట్ హబ్ దుబాయిలో కూడా...

సీమన్స్, అరుప్, లా ఒరెల్, ఎరిక్‌సన్, క్రాఫ్ ఫుడ్, ఎస్‌పీఎక్స్ కార్పొరేషన్‌తో పాటు డజనుకు పైగా సంస్థలు ది గ్యాలరీ లో తమ తమ కార్యాల యాలు, రీటెయిల్ ఔట్‌లెట్లు ఏర్పాటు చేసుకున్నాయి. మొత్తం 3,95,000 చదరపు అడుగుల విస్తీర్ణం ఉంది. వీటిలో 50 శాతం ఆఫీస్ కార్యాలయాలకు అప్పుడే విక్ర యించబడింది.
అపోలో టైర్ భారత్ ఆపరేషన్ చీఫ్ సతీష్ శర్మ మాట్లాడుతూ కంపెనీ రెవెన్యూలో తమకు మధ్య ప్రాచ్య దేశాల నుంచి వస్తోందని అందుకే ఇక్కడ ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రతిష్ఠాత్మక మైన గ్యాలరీలో తమ కార్యాలయం 10,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో టైర్లను నిల్వ ఉంచుతామని.. ఈ ప్రాంతంలో తమ వ్యాపారాన్ని మరింత విస్తరిస్తామని.. పెరిగిపోతున్న వినియోగదారుల అవసరాలను తీర్చేందుకు ఇక్కడ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాల్సివచ్చిందని శర్మ వివరించారు.
దుబాయిలోని ప్రతిష్ఠాత్మకమైన ది గ్యాలరీ ప్రాంతంలో అపోలోటైర్ షోరూం ఏర్పాటు చేయడం పట్ల బాహా అబుతోబా, ప్రాజెక్టు డైరెక్టర్ సంతోషం వ్యక్తం చేశారు. అబుదబీ నుంచి నుంచి కారులో గంట ప్రయాణంలో ది గ్యాలరీకి చేరుకోవచ్చు. జబేల్ లీ మెట్రో స్టేషన్ రెండు మీటర్ల దూరంలో ఉంది.


Click it and Unblock the Notifications








