మా సామ్రాజ్యాన్ని మిడిల్ ఈస్ట్ హబ్ దుబాయిలో కూడా...

Apollo Tyres
దుబాయి: భారత్‌లో అగ్రశ్రేణి టైర్ల కంపెనీ అపోలో టైర్‌ వ్యాపారాన్ని విస్తరించే భాగంలో మధ్యప్రాచ్యదేశాల కు హబ్‌ దుబాయిను ఎంచుకుంది. దుబాయిలోని ది గేలర్సీ ఏ-గ్రేడ్‌ కార్యాలయం రీటెయిల్‌ రంగంలో ప్రవేశించిన కంపెనీల విషయానికి వస్తే అపోలో టైర్‌ 18వ సంస్థ అంతర్జాతీయ స్థాయి కంపెనీలు ఇక్కడి జబెల్‌అలీ ప్రాంతంలో స్థానికంగా వ్యాపారాలు సంస్థల సంఖ్య 50కి పెరిగింది. ప్రపంచప్రఖ్యాతి చెందిన కంపెనీలు ఇక్కడ కార్యాలయాలు ఏర్పాటు చేశాయి. చాలా మటుకు విదేశీ కంపెనీలు ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయని ఇక్కడి ప్రాజెక్టు నిర్మించిన డెవలపర్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

సీమన్స్‌, అరుప్‌, లా ఒరెల్‌, ఎరిక్‌సన్‌, క్రాఫ్‌ ఫుడ్‌, ఎస్‌పీఎక్స్‌ కార్పొరేషన్‌తో పాటు డజనుకు పైగా సంస్థలు ది గ్యాలరీ లో తమ తమ కార్యాల యాలు, రీటెయిల్‌ ఔట్‌లెట్లు ఏర్పాటు చేసుకున్నాయి. మొత్తం 3,95,000 చదరపు అడుగుల విస్తీర్ణం ఉంది. వీటిలో 50 శాతం ఆఫీస్‌ కార్యాలయాలకు అప్పుడే విక్ర యించబడింది.

అపోలో టైర్‌ భారత్‌ ఆపరేషన్‌ చీఫ్‌ సతీష్‌ శర్మ మాట్లాడుతూ కంపెనీ రెవెన్యూలో తమకు మధ్య ప్రాచ్య దేశాల నుంచి వస్తోందని అందుకే ఇక్కడ ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రతిష్ఠాత్మక మైన గ్యాలరీలో తమ కార్యాలయం 10,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో టైర్లను నిల్వ ఉంచుతామని.. ఈ ప్రాంతంలో తమ వ్యాపారాన్ని మరింత విస్తరిస్తామని.. పెరిగిపోతున్న వినియోగదారుల అవసరాలను తీర్చేందుకు ఇక్కడ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాల్సివచ్చిందని శర్మ వివరించారు.

దుబాయిలోని ప్రతిష్ఠాత్మకమైన ది గ్యాలరీ ప్రాంతంలో అపోలోటైర్‌ షోరూం ఏర్పాటు చేయడం పట్ల బాహా అబుతోబా, ప్రాజెక్టు డైరెక్టర్‌ సంతోషం వ్యక్తం చేశారు. అబుదబీ నుంచి నుంచి కారులో గంట ప్రయాణంలో ది గ్యాలరీకి చేరుకోవచ్చు. జబేల్‌ లీ మెట్రో స్టేషన్‌ రెండు మీటర్ల దూరంలో ఉంది.

Most Read Articles

English summary
Apollo Tyres is the 18th firm to move to The Galleries' A-grade offices and retail facilities in Dubai's Jabel Ali this year and brings the number of international and local businesses currently based there or undergoing fit-out to almost 50.
Story first published: Tuesday, July 12, 2011, 9:38 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X