అమితాబ్, అంబానీలు మెచ్చిన కారు.. ఇకపై భారత్‌లో..!

Maserati
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, నటుడు అజయ్ దేవగన్, ప్రముఖ పారిశ్రామికవేత్తలు విజయ్ మాల్య, అనిల్ అంబానీ వంటి హేమాహేమీల వద్ద మాత్రమే దర్శనమిచ్చే.. అత్యంత ఖరీదైన, విలాసవంతమైన కారు మాసేరటి కారు ఇకపై భారత లగ్జరీ కార్ మార్కెట్లో దర్శనమిన్ననుంది. బుగాటి, ఫెరారీ, లాంబోర్గిని, పార్షే వంటి కంపెనీలకు ధీటుగా సూపర్ లగ్జరీ స్పోర్ట్స్ కార్ సెగ్మెంట్లో గట్టి పోటీ ఇచ్చేందుకు ఇటలీకు చెందిన మాసేరటి సిద్ధంగా ఉంది. భారత్‌లో తమ ఉత్పత్తులకు భారీ డిమాండ్ ఉంటుందని కంపెనీ అధికార ప్రతినిధి ఒకరి వెల్లడించారు.

ఈ ఏడాది ఏప్రిల్ నెలలో మాసేరటి ఓ మోడల్‌ను భారత్ మార్కెట్లో విడుదల చేసే అవకాశాలున్నాయి. ఫియట్ సంస్థకు చెందిన అనుబంధ కంపెనీ అయిన మాసేరటి భారత్‌లోని ఓ కంపెనీతో భాగస్వామ్యంగా ఏర్పడి తమ కార్లను దిగుమతి చేసి దేశీయ మార్కెట్లో విక్రయించనుంది. ఇటలీలోని మోడెనాలో మాసేరటి పరిమిత సంఖ్య (లిమిటెడ్ ఎడిషన్)లో కార్లను తయారు చేస్తుంది. వీటిని దాదాపు 75 విదేశీ మార్కెట్లకు కంపెనీ ఎగుమతి చేస్తుంది. భారత్‌లో మూడు మాసేరటి మోడళ్లు అందుబాటులోకి రానున్నాయి. రెండు సీట్లు కలిగిన గ్రాన్ కాబిరో ధర రూ. 5 కోట్లు, సెడాన్ మోడల్ కారు క్వాట్రోపోర్ట్ ప్రారంభ ధర రూ. 3 కోట్లు, టాప్ ఎండ్ స్పోర్ట్స్ వెర్షన్ కూప్ మోడల్ కారు గ్రాన్‌తురిస్మో ధర 4.75 కోట్లుగా ఉంది.

More from DriveSpark

Article Published On: Monday, March 28, 2011, 16:02 [IST]
English summary

 In another fortnight time the Indian car market will get the glimpse of the Italian sensation from Maserati sports car to vie against Bugatti, Ferrari, Lamborghini and Porsche. The spokesperson from the company said there has been a huge potential for the company’s product in India.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+