ఆగస్టు నెలలో 3.5 శాతం తగ్గిన అశోక్ లేలాండ్ సేల్స్

గతేడాది ఇదే సమయంలో కంపెనీ అమ్మకాలు 7,480 యూనిట్లుగా ఉన్నట్లు అశోక్ లేలాండ్ ఓ ప్రకటనలో పేర్కొంది. అలాగే గతేడాదితో పోలిస్తే.. ఇదే కాలానికి దేశీయ అమ్మకాలు 6,705 యూనిట్ల నుంచి యూనిట్లకు పడిపోగా, ఎగుమతులు మాత్రం 775 యూనిట్ల నుంచి 1,050 యూనిట్లకు పెరిగాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-ఆగస్టు నాటికి అశోక్ లేలాండ్ మొత్తం దేశీయ అమ్మకాలు 29,487 యూనిట్లుగా ఉన్నాయి. గడచిన ఆర్థిక సంవత్సరంలో ఇవి 31,861 యూనిట్లుగా ఉన్నట్లు కంపనీ తెలిపింది. ఇదే కాలనికి ఎగుమతులతో కలిపి మొత్తం అమ్మకాలు 34,329 యూనిట్లుగా ఉన్నాయి.


Click it and Unblock the Notifications








