బిఆర్‌టిసి నుంచి 23 మిలియన్ డారల్ల ఆర్డర్ పొందిన అశోక్ లేలాండ్

చెన్నయ్‌కు చెందిన భారతదేశపు అతిపెద్ద వాణిజ్య వాహనాల తయారీ సంస్థ అశోక్ లేలాండ్ (హిందుజా గ్రూప్ కంపెనీలో ఓ భాగం) ట్రక్కులు, బస్సులు వంటి వాణిజ్య వాహనాలు మాత్రమే కాకుండా.. అత్యవసర మరియు మిలటరీ వాహనాలను కూడా తయారు చేస్తుంది.
కాగా.. అశోక్ లేలాండ్ గడచిన (2010-11) ఆర్థిక సంవత్సరానికి గానూ కంపెనీ ఆదాయాలను 54 శాతానికి పెంచుకుంది. 2009-10 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ టర్నోవర్ రూ. 7,244.71 కోట్లుగా ఉంటే.. అది 2010-11 నాటికి రూ. 11,117.71 కోట్లకు పెరిగిందిని తెలిపింది. అలాగే కంపెనీ నికర లాభాల్లో కూడా గతేడాదితో పోలిస్తే 49 శాతం వృద్ధిని సాధించి రూ. 423.67 నుంచి రూ. 631.30 కోట్లకు పెరిగింది.


Click it and Unblock the Notifications








