మూడో డ్రైవింగ్ శిక్షణా కేంద్రానికి పునాది వేసిన అశోక్ లేలాండ్

కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఈ శిక్షణా కేంద్రాన్ని 15 ఎకరాల స్థలంలో హెవీ కమర్షియల్ వెహికల్ డ్రైవర్ ట్రైనింగ్‌కు కావలసిన అన్ని సదుపాయాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోనున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఎయిట్-కర్వ్, ఎస్-కర్వ్, సిక్స్-లేన్ రోడ్స్, విలేజ్ రోడ్లతో పాటు ఓ మోడ్రన్ సిమ్యులేటర్‌ను నిర్మించినున్నట్లు కంపెనీ వివరించింది.
డ్రైవర్ కమ్యూనిటీతో సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు ఇటువంటి శిక్షణ కార్యక్రమాలు అందిస్తున్న కొద్దిపాటి కంపెనీలలో ఆశోక్ లేలాండ్ కూడా ఒకటని కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్-చైర్మన్ ఆర్ శేషసాయి చెప్పారు. తమిళనాడు, న్యూఢిల్లీలలో ఉన్న శిక్షణా కేంద్రాల ద్వారా ఏటా 40,000 డ్రైవర్లు శిక్షణ పొందుతున్నారని, హర్యానా, రాజస్థాన్‌లలో కూడా మరికొన్ని కేంద్రాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని ఆయన చెప్పారు.


Click it and Unblock the Notifications








