ప్యాసింజర్ వాహన విభాగంలోకి అశోక్ లేలాండ్!

అంతేకాకుండా.. ఇదే సమయానికి సిఎన్‌జీ వేరియంట్లను కూడా ప్రవేశపెట్టాలని కంపెనీ యోచిస్తోంది. కంపనీ ఇటీవల విడుదల చేసిన 1.2 టన్నుల దోస్త్ ఎల్‌సీవీ (లైట్ కమర్షియల్ వెహికల్) ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా ఓ 7-8 సీటర్ ప్యాసింజర్ వాహనాన్ని అలాగే, నిస్సాన్ ఎన్‌వీ 200 ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా మరో ఎమ్‌పివి (మల్టీ యుటిలిటీ వాహనం)ను ప్రవేశపెట్టాలని కంపెనీ భావిస్తోంది. ఇది టొయోటా ఇన్నోవాకు పోటీగా నిలువనుంది.
టాంజానియా నుంచి భారీ ఆర్డర్:
ఇదిలా ఉండగా.. అశోక్ లేలాండ్‌కు జాక్‌పాట్ లభించింది. టాంజానియా ప్రభుత్వం నుంచి 723 ట్రక్కులు, బస్సుల సప్లయ్‌కు సంబంధించి ఓ భారీ ఆర్డర్‌ను సంపాదించింది. ఈ ఆర్డర్ విలువ సుమారు 36.56 మిలియన్ అమెరికన్ డాలర్లు. ఈ ఆర్డర్ ద్వారా అశోక్ లేలాండ్ టాంజానియా మార్కెట్లోకి కూడా ప్రవేశించినట్లయింది.


Click it and Unblock the Notifications








