2010-11లో రూ. 11,118 కోట్లకు పెరిగిన అశోక్ లేలాండ్ టర్నోవర్

గత ఆర్థిక సంవత్సరంలో దేశీయ, విదేశీయ విక్రయాలు భారీ వృద్ధి చెందడం వల్లే ఈ ఫలితాలు సాధించినట్లు అశోక్ లేలాండ్ మేనేజింగ్ డైరెక్టర్ వినోద్ కె.దాసరి అన్నారు. భారత మార్కెట్లో 45 శాతం అధికంగా 83,800 వాహనాలను విక్రయిస్తే, అంతర్జాతీయ మార్కెట్లలో 71 శాతం వృద్ధిని సాధించి 10,306 యూనిట్లను విక్రయించినట్లు కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతం బస్సుల విక్రయాలలో అశోకే లేలాండ్ దేశీయ మార్కెట్లో 58 శాతం వాటా కలిగి ఉంది. అలాగే ఈ ఆర్థిక సంవత్సరంలో అంతర్జాతీయ స్థాయిలో బస్సుల విక్రయాల్లో తొలి-5, ట్రక్కుల విక్రయాల్లో తొలి-10 స్థానాల్లో చోటు సంపాదించడమే లక్ష్యమని దాసరి తెలిపారు.


Click it and Unblock the Notifications








