ఆంధ్రప్రదేశ్‌ మార్కెట్లో ‘దోస్త్‌’ని ఆవిష్కరించిన అశోక్‌ లేలాండ్‌

Ashok Leyland launches Dost
హిందూజా గ్రూప్‌ ఫ్లాగ్‌షిప్‌ సంస్థ అయిన అశోక్‌ లేలాండ్‌ ఆంధ్రప్రదేశ్‌ మార్కెట్లో 'దోస్త్‌'ను కమర్షియల్‌గా ఆవిష్కరించింది. దీంతో వేగంగా అభివృద్ధి చెందుతున్న తేలికపాటి వాణిజ్య విభాగంలో అశోక్‌ లైలాండ్‌ ప్రవేశించినట్లయింది. ఇదే సందర్భంగా నిస్సాన్‌ మోటార్‌తో కలిసి నిర్వహిస్తు న్న జాయింట్‌ వెంచర్‌లో భాగంగా రూ.3.81లక్షల నుంచి రూ.4.40లక్షల రూపాయల ధరలో (ఎక్స్‌ షోరూమ్‌, హైదరాబాద్‌) దోస్త్‌ మోడరన్‌ డీలర్‌షిప్‌ నెట్‌వర్క్‌ల ద్వారా లభ్యమవుతుంది. సరికొత్త మౌలిక సదుపాయాలతో ఏర్పాటు చేసిన ఈ తరహా 60 కొత్త డీలర్‌షిప్‌ కేంద్రాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా ఏర్పాటు చేయను న్నట్లు హిందూజా ఆటోమోటివ్‌ లిమిటెడ్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ఛైర్మన్‌, నిస్సాన్‌ అశోక్‌ లైలాండ్‌ పవర్‌ ట్రెయిన్‌ లిమిటెడ్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ వి. సుమంత్రన్‌ తెలిపారు.

ఇండియన్‌ ఖరీ దుకు జపాన్‌ సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన వాహనం తో ఎల్‌సివి కస్టమర్‌కు అందించాలని తాము చేసిన ప్రయత్నంలో భాగంగా 'దోస్త్‌'ను విడుదల చేసినట్లు చెప్పారు. దోస్త్‌ 1.25 టన్నుల బరువును మోసుకుపోగల వాహనం మూడు వర్షన్లలో లభిస్తుందన్నారు. టాప్‌-ఎండ్‌ వర్షన్‌లో ఎయిర్‌ కండిషనింగ్‌, పవర్‌ సిస్టమ్‌, పవర్‌ స్టీరింగ్‌, డ్యూయల్‌ కలర్‌ బైగీ, గ్రేటి మ్‌, ఫ్యాబ్రిక్‌ సీట్స్‌ ప్రధాన ఆకర్షణలని తెలిపారు. ప్రపంచ స్థాయి నాణ్యతతో తయారైన 55 హెచ్‌పి, 3 సిలిండర్‌, 1.5 లీటర్‌ కామర్‌ రైల్‌ టిడిసిఆర్‌తో ఇది తయారైంది.

150 ఎస్‌ఎం టార్క్‌తో భారత్‌లోని రహదార్లకు అనుగుణంగా ఉంటూ ఇంధన పొదుపును పాటిస్తూ మంచి డ్రైవింగ్‌ అనుభూతిని అందించేలా దోస్త్‌ ఇంజన్‌ తయారైంది. వినియోగదారులు తమకు నచ్చిన రంగును ఎంచు కునేందుకు వీలుగా వైట్‌, బైగ్‌, బ్లూ కలర్‌లలో పాలెట్‌లు ఉన్నాయి. ఎల్‌సివి ఇండస్ట్రీలో తొలిసారిగా దోస్త్‌ ప్లాట్‌ఫాంను ఉపయోగించు కుంటూ రెడీ-టూ-యూజ్‌ వెహికల్స్‌ను ఆశోక్‌ లైలాండ్‌ ఆఫర్‌ చేయనుంది.

More from DriveSpark

Article Published On: Sunday, September 25, 2011, 11:37 [IST]
English summary
The base model of Dost, the light commercial vehicle (LCV) bearing Ashok Leyland badge, is priced at Rs.3.79 lakh ex-Chennai. Dost with power steering will be available at Rs.3.98 lakh.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+