వాణిజ్యపరంగా దోస్త్ ఎల్‌సీవిని లాంచ్ చేసిన అశోక్ లేలాండ్

కాగా.. సోమవారం ఈ దోస్త్ పికప్ ట్రక్‌ను అశోక్ లేలాండ్ వాణిజ్య పరంగా మార్కెట్లోకి విడుదల చేసింది. ఇప్పటి వరకూ మద్య తరహా, భారీ వాణిజ్య వాహనాలను మాత్రమే అందిస్తున్న అశోక్ లేలాండ్ 1.25 టన్నుల బరువు మోయగలిగిన దోస్త్ పికప్ విడుదలతో చిన్న తరహా వాణిజ్య వాహన విభాగంలోనికి ప్రవేశించినట్లయింది.
తమ వాహనం చిన్న తరహా వ్యాపారుల వాణిజ్య అవసరాలకు సమర్థవంతంగా సరిపోతుందని ఇరు కంపెనీలు పేర్కొన్నాయి. భారత మార్కెట్లో దోస్త్ పికప్ ట్రక్ ధరల శ్రేణి రూ.3.79 లక్షలు నుండి రూ.4.39 లక్షలు (ఎక్స్ షోరూమ్, చెన్నై) వరకూ ఉన్నాయి. హోసూర్‌లోని అశోక్ లేలాండ్ ప్లాంటులో ఈ వాణిజ్య వాహనాన్ని తయారు చేస్తున్నారు.
1.25 టన్నుల పేలోడ్ సామర్థ్యంతో లభించే దోస్త్ వాహనం 55 హెచ్‌పి (హార్స్ పవర్)ల శక్తిని కలిగి ఉండే 3-సిలిండర్, 1.5 లీటర్ సిఆర్‌డిఐ (కామన్ రైల్ డైరెక్ట్ ఫ్యూయెల్ ఇంజక్షన్) ఇంజన్‌తో లభిస్తుంది. యూరో-లుక్‌లో ఉండే దోస్త్ క్యాబిన్ విశాలవంతంగా ఉండి ఎంతో సౌకర్యంగా ఉంటుందని ఈ జేవి పేర్కొంది. దోస్త్ బిఎస్-3, మరియు బిఎస్-4లతో మూడు వేరియంట్లలో లభించనుంది.


Click it and Unblock the Notifications








