మార్కెట్లోకి అశోక్ లేలాండ్ - నిస్సాన్‌ల దోస్త్!

AL Nissan JV
హిందూజా గ్రూపుకు చెందిన ఫ్లాగ్‌షిప్ కంపెనీ అశోక్ లేలాండ్, జపాన్‌కు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం నిస్సాన్ మోటార్ కంపెనీలు సంయుక్తంగా తయారు రూపొందిస్తున్న తొలి చిన్న తరహా వాణిజ్య వాహనం 'దోస్త్‌' పికప్ ట్రక్‌ను దేశీయ మార్కెట్లోకి ప్రవేశించింది. 1.25 టన్నుల బరువు మోయగలిగిన ఈ వాహనం చిన్న తరహా వ్యాపారుల వాణిజ్య అవసరాలకు సమర్థవంతంగా సరిపోతుందని ఇరు కంపెనీలు తెలిపాయి.

ప్రస్తుత త్రైమాసికంలోనే ఇది పూర్తిస్థాయిలో మార్కెట్లోకి అందుబాటులోకి రానున్నట్లు అశోక్ లేలాండ్, నిస్సాన్ సంస్థలు ప్రకటించాయి. హోసూర్ అశోక్ లేలాండ్‌ ప్లాంటులో వాణిజ్య వాహనాన్ని తయారు చేస్తున్నారు. ఇదేకాకుండా.. ఆరు టన్నుల బరువు మోయగల ఒక ట్రక్కును మరియు ఒక చిన్న వ్యాన్‌ను కూడా విడుదల చేసేందుకు ఈ జాయింట్ వెంచర్ సన్నాహాలు చేస్తుంది. దోస్త్ మార్కెటింగ్ కార్యకలాపాలను అశోక్ లేలాండ్ నిర్వహించనుంది.

1.25 టన్నుల పేలోడ్ సామర్థ్యంతో లభించే దోస్త్ వాహనం 55 హెచ్‌పి (హార్స్ పవర్)ల శక్తిని కలిగి ఉండే 3-సిలిండర్, 1.5 లీటర్ సిఆర్‌డిఐ (కామన్ రైల్ డైరెక్ట్ ఫ్యూయెల్ ఇంజక్షన్) ఇంజన్‌తో లభిస్తుంది. యూరో-లుక్‌లో ఉండే దోస్త్ క్యాబిన్ విశాలవంతంగా ఉండి ఎంతో సౌకర్యంగా ఉంటుందని ఈ జేవి పేర్కొంది. దోస్త్ బిఎస్-3, మరియు బిఎస్-4లతో మూడు వేరియంట్లలో లభించనుంది.

More from DriveSpark

Article Published On: Monday, July 25, 2011, 10:34 [IST]
English summary
Hinduja Group flagship company Ashok Leyland and Japanese auto gaint Nissan Motor Company jointly developing product 'Dost' LCV has been rolled out from the Hosur facility of Ashok Leyland.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+