భారత మార్కెట్లోకి జేమ్స్ బాండ్ ఆస్టన్ మార్టిన్ కార్లు..!!

ఇందుకోసం ఆస్టన్ మార్టిన్ సంస్థ భారత్‌లోని "ఇన్ఫినిటీ కార్స్"తో ఓ ఒప్పందాన్ని కుదుర్చుంది. ఇన్ఫినిటీ కార్స్ కంపెనీ ద్వారా భారత్‌లో తమ అన్నిరకాల ఉత్పత్తులను విక్రయించాలని ఆస్టన్ మార్టిన్ భావిస్తోంది. ఆస్టన్ మార్టిన్ కంపెనీ ఏప్రిల్ 15, 2011న ముంబైలో అధికారికంగా తమ కార్యకలాపాలను ప్రారభించనున్నట్లు సమాచారం. ఇన్ఫినిటీ కార్స్ ముంబై, నాగ్‌పూర్‌లలో ఉన్న తమ డీలర్‌షిప్ కేంద్రాల ద్వారా బిఎమ్‌డబ్ల్యూ కార్లను విక్రయిస్తుంది. భారత్‌లో ఆస్టన్ మార్టిన్ కార్ల ధర రూ. 1.3 కోట్ల నుంచి 2.9 కోట్ల వరకూ ఉండవచ్చునని అంచనా.


Click it and Unblock the Notifications








