ప్రముఖ త్రిచక్ర వాహనాల ఉత్పత్తి సంస్థ అతుల్ ఆటో త్వరలోనే నాలుగు చక్రాల కమర్షియల్ వాహనరంగంలోకి ప్రవేశించనుంది. ఇందుకోసం కంపెనీ ఇప్పటికే అమ్మదాబాద్ ప్రాంతంలో భూసేకరణ కార్యక్రమాలు చేపడుతోంది. రానున్న కాలంలో అర్బన్ మార్కెట్లలో త్రిచక్ర వాహనాల స్థానాన్ని తేలిక పాటి వాణిజ్య వాహనాలు (లైట్ కమర్షియల్ వెహికల్స్) భర్తీ చేస్తాయని దీంతో తాము త్వరలోనే చిన్నపాటి నాలుగు చక్రాల వాణిజ్య వాహనాన్ని ఉత్పత్తి చేయాలనకుంటున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.
ఈ ప్రతిపాదనకు సంబంధించి తమ టెక్నికల్ టీమ్ కసరత్తులు చేస్తోందని అతుల్ ఆటో పేర్కొంది. అయితే దీనికి సంబంధించిన మరిన్న వివరాలను మాత్రం కంపెనీ వెల్లడించలేదు. మరోవైపు రాజ్‌కోట్‌కు చెందిన అతుల్ ఆటో ప్రభుత్వ రంగ సంస్థ అయిన స్కూటర్స్ ఇండియాలో వాటాలను కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.