ఆడి ఏ6 లగ్జరీ కారు ఫీచర్లు మరియు ధరలు

ఆడి ఏ6 నాలుగు వేరియంట్లలో లభ్యమవుతుంది. ఆడి ఏ6 ఎల్ యొక్క అడ్వాన్స్‌డ్ టెక్నాలజీని మరియు ఆడి ఏ7 స్పోర్ట్‌బ్యాక్ యొక్క డిజైన్ ఫీచర్లను కలబోసి సరికొత్త ఆడి ఏ6ను రూపొందించినట్లు కంపెనీ పేర్కొంది. ఈ కారు బరువును తగ్గించేందుకు కోసం దీని తయారీలో 50 శాతం వరకూ అల్యూమినియంను ఉపయోగించారు. ఆటో సస్సెన్షన్ మోడ్‌లో ఉన్నప్పుడు 'అడాప్టివ్ ఎయిర్ సస్పెన్షన్' ఫీచర్ వల్ల కారు వేగాన్ని బట్టి దాని ఎత్తు మారుతుంటుంది.
ఇందులో ఆటో స్టార్ట్-స్టాప్ టెక్నాలజీ ఉండటం వల్ల ట్రాఫిక్ జామ్‌లలో ఎక్కవసేపు ఇంజన్‌ను రన్నింగ్‌లో ఉంచినప్పుడు ఇంజన్ దానంతట అదే ఆఫ్ అవుతుంది, తిరిగి యాక్సిలరేటర్‌ను నొక్కగానే ఇంజన్ స్టార్ట్ అవుతుంది. ఇంకా ఇందులో ఎల్ఈడి హెడ్‌ల్యాంప్స్, ఆడి డ్రైవ్ సెలక్ట్, ఎమ్‌ఎమ్‌ఐ టచ్, 8 ఇంచ్ స్క్రీన్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా కారులోని ఉష్ణోగ్రతలు ఆటోమేటిక్‌గా మారుతుంటాయి. ఆడి ఏ6లో మొత్తం ఏడు గేర్లు ఉంటాయి.
ఆడి ఏ6 గరిష్టంగా గంటకు 250 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. డీజిల్ వేరియంట్ ఆడి ఏ6 సిటీ రోడ్లపై 9.3 కి.మీ. మైలేజ్‌ను మరియు హైవే రోడ్లపై 14.3 కి.మీ. మైలేజ్‌ను ఇస్తుంది. హైదరాబాద్ మార్కెట్లో ఈ విధంగా ఉన్నాయి. ఆడి ఏ6 2.0 టిడిఐ - రూ. 38.37 లక్షలు, ఆడి ఏ6 2.8 ఎఫ్ఎస్ఐ - రూ. 40.61 లక్షలు, ఆడి ఏ6 3.0 టిడిఐ - రూ. 47.78 లక్షలు, ఆడి ఏ6 3.0 టిఎఫ్ఎస్ఐ - రూ. 47.84 లక్షలు (అన్ని ధరలు కూడా ఎక్స్-షోరూమ్ హైదరాబాద్).


Click it and Unblock the Notifications








