ఆడి కొనుగోలుదారులకు రుణ సదుపాయం: ఆడి ఇండియా

ఈ ఏడాది తొలి త్రైమాసికం (ఏప్రిల్ 2011-జూన్ 2011)లో ఫైనాన్స్ స్కీమ్‌కు శ్రీకారం చుట్టనున్నామని, తాము అందిస్తున్న అన్నిరకాల కార్లపై (లగ్జరీ, ఎస్‌యూవీలతో కలిపి) ఈ రుణ సదుపాయం అందుబాటులో ఉంటుందని ఆడి ఇండియా డైరెక్టర్ మైఖేల్ పెష్కీ తెలిపారు. ఫైనాన్స్ విభాగాన్ని ఆడి ప్రత్యేకంగా నిర్వహించనుంది. ఈ పథకం ద్వారా 2011లో ఆడి విక్రయాలను 4,500 యూనిట్లకు పెంచుకోవాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. 2010లో ఆడి 3,003 కార్లను మాత్రమే విక్రయించింది.
మారుతున్న వినియోగదారుల అభిరుచుల గురించి ఆడికు అవగాహన ఉందని, ఒక దశాబ్దం క్రితం లగ్జరీ కార్లను సగటున 55 ఏళ్ల వయస్సు కలిగిన వారు కొనుగోలు చేసేవారని, కానీ ప్రస్తుతం 35 ఏళ్ల వయస్సు కలిగినవారే లగ్జరీ కార్లను కొనుగోలు చేస్తున్నారని ఆయన చెప్పారు. ఆడి కార్లకు ఇదివరకే రుణసదుపాయం ఇస్తున్న ఫైనాన్స్ సంస్థలతో పాటు ఆడి ఇండియా కంపెనీ కూడా తమ వాహనాలకు లోన్ సౌకర్యం కల్పిస్తుంది.


Click it and Unblock the Notifications








