భారత్‌లోకి ఏ3 సెడాన్‌ను విడుదల చేయాలని భావిస్తున్న ఆడి

మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం 2012 తర్వాత ఏ3 సెడాన్ భారత్‌కు వచ్చే అవకాశాలున్నాయి. భారత్‌లో ఇది పెట్రోల్ మరియు డీజిల్ రెండు వేరియంట్లలో మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభించవచ్చు. కాగా.. జెనీవా మోటార్ షోలో ప్రదర్శించి ఏ3 సెడాన్ కాన్సెప్ట్ కారు క్వెట్టారో ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్ కలిగినది, అయితే ఎంట్రీ లెవల్ వేరియంట్లలో మనం రియర్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌ను ఎక్స్‌పెక్ట్ చేయవచ్చు. దీని వల్ల కారు ధర తగ్గడమే కాకుండా, ఇంధన సామర్థ్యం కూడా పెరుగుతుంది. ఏ3 సెడాన్ భారత మార్కెట్లోకి వచ్చినట్లయితే.. ఇప్పటికే ఈ విభాగంలో హవా కొనసాగిస్తున్న మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్, బిఎమ్‌డబ్ల్యూ 3-సిరీస్‌ల నుంచి గట్టి పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications








