ఆరు నెలల వృద్ధిని కేవలం మూడు నెలల్లో సాధించిన ఆడి

Audi
భారత్‌లో విలాసవంతమైన కార్లను విక్రయిస్తున్న మూడవ అతిపెద్ద లగ్జరీ వాహనాల తయారీ సంస్థ ఆడి ఇండియా, 2010 సంవత్సరం తొలి రెండు త్రైమాసికా(క్వార్టర్)ల్లో సాధించిన వృద్ధిని, 2011 సంవత్సరం మొదటి త్రైమాసికం (జనవరి 2011 - మార్చి 2011)లోనే సాధించగలిగినట్లు పేర్కొంది. జనవరి-మార్చి, 2011లో భారత మార్కెట్లో ఆడి 1,611 కార్లను విక్రయించింది. ఈ ఏడాది ఒక్క మార్చి నెలలోనే మొత్తం 681 ఆడి కార్లను విక్రయించింది. కాగా.. 2010 మొత్తం సంవత్సరానికి గానూ కంపెనీ 3003 కార్లను విక్రయించింది. అంటే గతేడాది ఆరు నెలల్లో సాధించిన వృద్ధి ఈ ఏడాది కేవలం మూడు నెలల్లోనే ఆడి సాధించగలిగింది.

ఆడి ఇండియా ఇటీవలే మార్కెట్లోకి విడుదల చేసిన ఆర్8 స్పైడర్, క్యూ5 2.0 టిడిఐ కార్లతో భవిష్యత్తులో మరింత వృద్ధిని సాధించగలమని కంపెనీ భావిస్తోంది. ఒక్క త్రైమాసికంలోనే గతేడాది రెండు త్రైమాసికాల్లో సాధించిన వృద్ధిని అదిగమించడంతో ఆడి ఇండియాకు 2011 సంవత్సరం అత్యంత విజవంతమైన సంవత్సరంగా మారగలదని ఆడి ఇండియా హెడ్ మైఖేల్ ప్రెస్కీ ధీమా వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న తమ డీలర్‌ నెట్‌వర్క్‌ను విస్తరించుకోవడంపై దృష్టి సారించామని, ఇండియన్ లగ్జరీ కార్ మార్కెట్లో లీడర్‌షిప్ కోసం కృషి చేస్తున్నామని ఆయన చెప్పారు.

More from DriveSpark

Article Published On: Thursday, April 14, 2011, 12:38 [IST]
English summary
India's 3rd largest luxury car maker Audi India, has been witnessing a rapid growth in its sales in 2011. With the Q1 sales standing at a 107% hike against last year's Q1 sales of 778 units, Audi India has already crossed the half the sales mark in had last year.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+