ఆగస్టు నెలలో రెండు రెట్లుకు పైగా పెరిగిన ఆడి సేల్స్

ఆగస్టు 2010లో కంపెనీ 250 యూనిట్లను మాత్రమే విక్రయించింది. కాగా.. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకూ మొత్తం 3,655 కార్లను విక్రయించి గతేడాది ఇదే సమయంతో పోలిస్తే 95 శాతం వృద్ధిని నమోదు చేసుకుంది. ఆడికు ప్రపంచ వ్యాప్తంగా వృద్ధి చెందుతున్న మార్కెట్ల కన్నా భారత్ ఒకడుగు ముందే ఉందని ఆడి ఇండియా హెడ్ మైఖేల్ ప్రెస్కీ తెలిపారు.
భారత లగ్జరీ కార్ మార్కెట్లో 2015 నాటికి తాము నెంబర్ వన్‌గా నిలువగలమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ ఏఢాది ఇతర పోటీదారులు భారత్‌లో వారి లక్ష్యాలను తగ్గించుకుంటుంటే, తాము మాత్రం తమ లక్ష్యాన్ని 5,000 యూనిట్లకు పెంచుకున్నామని ప్రెస్కీ చెప్పారు. వచ్చే ఏడాది తమ ఎస్‌యూవీ క్యూ3 మోడల్ విడుదలతో ప్రోడక్ట్ ప్రోడక్ట్‌ఫోలియోను విస్తరించుకోవడమే కాకుండా, 2012 నాటికి తమ డీలర్‌షిప్‌లను 25కు పెంచుకోకున్నట్లు ఆయన చెప్పారు.


Click it and Unblock the Notifications








