అప్పుడు రవి శాస్త్రికి.. ఇప్పుడు యువీకి.. ఆడి లగ్జరీ కారు గిఫ్ట్

Audi India-Yuvraj Singh
28 ఏళ్లుగా భారతీయుల యావత్ దేశం ఎదురు చూస్తున్న విజయాన్ని భారత జట్టు సాధించి ప్రపంచ కప్‌ను జాతికి అందించడంతో ఇటు ప్రభుత్వం అటు కంపెనీలు భారత ఆటగాళ్లకు ఆకర్షనీయైన బహుమతులు అందించి వారిని మరింత ముందుకు నడిపేలా ప్రోత్సహిస్తున్నారు. ప్రపంచ కప్ 2011లో మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును గెలుచుకున్న భారత స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్‌కు సరికొత్త ఆడి లగ్జరీ కారును బహుమతిగా ఇవ్వనున్నట్లు ఆడి ఇండియా ప్రకటించింది.

1985లో ఆస్ట్రేలియాలో జరిగిన ప్రపంచ కప్‌లో కూడా భారత జట్టు గెలవడంతో జర్మన్ లగ్జరీ కార్ల దిగ్గజమైన ఆడి, అప్పటి మేటి ఆటగాడు రవి శాస్త్రికి "ఆడి 100 సెడాన్" కారును బహమతిగా ఇచ్చింది. ఆ టోర్నమెంట్‌లో రవి శాస్త్రి తన అద్భుతమైన ప్రతిభతో "ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్" టైటిల్‌ను దక్కించుకున్నారు. ఈ సాంప్రదాయాన్ని ఇలానే కొనసాగించాలనే నేపథ్యంతో ఆడి ఇండియా యువరాజ్ సింగ్‌కు ఓ లగ్జరీ కారును బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది.

More from DriveSpark

Article Published On: Tuesday, April 5, 2011, 11:48 [IST]
English summary
Indian star player Yuvraj Singh, the 'Man of the Tournament' in WC 2011 is to be gifted with a brand new luxury car from Audi India, company said in statement. The German luxury car maker Audi in 1985 also gifted Audi 100 Sedan to Ravi Shastri for his terrific performance that year.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+