75 శాతం పెరిగిన ఆడి ఇండియా జూన్ నెల అమ్మకాలు

ఈ ఏడాది జనవరి-జూన్ కాలానికి గానూ ఆడి అమ్మకాలు, గతేడాది ఇదే సమయంతో పోలిస్తే రెండింతలు వృద్ధి చెందాయి. జనవరి-జూన్ 2010లో కంపెనీ కేవలం 1,400 యూనిట్లను మాత్రమే విక్రయిస్తే, జనవరి-జూన్ 2011లో ఆడి ఇండియా 2,802 యూనిట్లను విక్రయించింది. ఈ ఏడాది ఫస్టాఫ్ (ప్రధమార్థం)లో కంపెనీ అత్యత్తుమైన ప్రతిభను కనబరిచిందని త్వరలోనే తమ 2010 వార్షిక విక్రయాల సంఖ్య (3003 యూనిట్ల)ను అధిగమిస్తామని ఆడి ఇండియా హెడ్ మైఖేల్ ప్రెస్కీ తెలిపారు.


Click it and Unblock the Notifications








