ఆడి ఇండియా ఫిబ్రవరి విక్రయాలలో 79% వృద్ధి

తమ కంపెనీ 2010లో జోరును ఈ ఏడాది కూడా కొనసాగించగలదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కొత్త ఉత్పత్తులు, నెట్‌వర్క్ విస్తరణల గురించి మునుముందు ఆడి ఇండియా మరికొన్ని ప్రకటనలను వెలువరించనుందని పెష్కీ చెప్పారు. ఫ్లాగ్‌షిప్ మోడల్ ఆడి ఏ8 ఎల్, సూపర్ స్పోర్ట్స్ కార్ ఆడి ఆర్8 వీ10 కార్లను భారత్‌లో విడుదల చేయడం ద్వారా ఆడి ఇండియా తమ ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోను విస్తరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ రెండు మోడళ్లు దేశవ్యాప్తంగా ఆడి షోరూమ్‌లలో అందుబాటులో ఉన్నట్లు కంపెనీ తెలిపింది.
త్వరలోనే ఆడి క్యూ5 మోడల్‌లో డీజిల్ వేరియంట్ కారును కూడా విడుదల చేస్తామని ఆయన తెలిపారు. ఎస్‌యూవీ విభాగంలో ఆధిపత్యం కోసం కృషి చేస్తామని, ఈ ఏడాది ఆడి ఏ6, ఆడి ఏ7 కార్లను భారత మార్కెట్లో ప్రవేశపెట్టనున్నామని ఆయన చెప్పారు. అంతేకాకుండా.. చెన్నయ్, ఢిల్లీలలో కూడా ఈ ఏడాది డీలర్‌షిప్ నెట్‌వర్కు విస్తరించనున్నట్లు పెష్కీ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆడి ఇండియాకు అహ్మదాబాద్, బెంగళూరు, చంఢీగఢ్, గుర్గావ్, హైదరాబాద్, జైపూర్, కోచి, కోల్‌కతా, లూథియానా, ముంబై, పూనేలలో ఔట్‌లెట్‌లున్నాయి.


Click it and Unblock the Notifications








