ఇటీవలే ముగిసిన క్రికెట్ మహాసంగ్రామం వరల్డ్ కప్ 2011లో అదరగొట్టే పెర్ఫామెన్స్‌ను కనబరిచి లక్కీ కార్ "ఆడి క్యూ5"ను భారత జట్టు యువ క్రీడా కెరటం యువరాజ్ సింగ్ కానుకగా పొందిన సంగతి తెలిసిందే. విలాసవంతమైన కార్ల విక్రయాలలో భారత్‌లో అగ్రగాములుగా ఉన్న కంపెనీలలో ఒకటైన "ఆడి ఇండియా" గత మార్చిలో దేశీయ మార్కెట్లో ప్రవేశపెట్టిన సరికొత్త స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం 'ఆడి క్యూ5'ను ఇప్పుడు రాష్ట్ర వినియోగదారులకు కూడా అందుబాటులో ఉండే విధంగా హైదరాబాద్‌లో విడుదల చేసింది. రాష్ట్ర మార్కెట్లో ఆడి క్యూ5 2.0 టిడిఐ క్వెట్టారో ధర రూ. 4,051,000గా నిర్ణయించినట్లు ఆడి హైదరాఆద్ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ సంఘ్వీ తెలిపారు.
డైనమిక్ 7 స్పీడ్ ఎస్ ట్రోనిక్ ట్రాన్షిమిషన్‌తో కూడిన 2.0 టిడిఐ క్యూ ఇంజన్ బిగించడం వలన ఈ కారు మంచి సామర్ద్యంతో పాటు సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కలిగిస్తుందని ఆడి ఇండియా హెడ్ మైఖేల్ ప్రెస్కీ వివరించారు. ఆడి క్యూ5 కారు 2.0 టిఎప్ఎస్ఐ క్యూ పెట్రోల్ ఇంజన్ మరియు 3.0 టిడిఐ క్యూ డీజిల్ ఇంజన్ ఆఫ్షన్లలో లభిస్తుంది. ప్రస్తుతం భారత్‌లో ఆడి ఏ4, ఆడి ఏ6, ఆడి ఏ8, ఆడి క్యూ5, ఆడి క్యూ7, ఆడి టిటి, ఆడి ఆర్8 స్పోర్ట్ వెర్షన్ మరియు ఆడి ఆర్8 స్పైడర్ కార్లు అందుబాటులో ఉన్నాయి.