ఢిల్లీలో ఆడి కొత్త మోడల్ కార్లను ఆవిష్కరించిన దీపికా పదుకొనే

ఆస్టన్ మార్టిన్ ర్యాపిడ్, మెర్సిడెస్ సిఎల్ఎస్, పోర్షే పనామెరా వంటి కార్లకు ఆడి ఏ7 స్పోర్ట్స్‌బ్యాక్ కారు గట్టి పోటీ ఇవ్వగలదని కంపెనీ భావిస్తోంది. ఇది 3.0 లీటర్ టిడిఐ వీ6 డీజిల్ ఇంజన్‌తోనూ, 3.0 లీటర్ టిఎఫ్ఎస్ఐ పెట్రోల్ ఇంజన్‌తోనూ లభిస్తుంది. ఆకర్షనీయమైన ఎల్ఈడి లైట్లతో, అత్యంత విలాసవంతమైన ఇంటీరియర్స్‌తో కళ్లు చెదిరే అందం ఆడి ఏ7 సొంతం. మే నెలాఖరు నుంచి ఈ కారు డెలివరీలను ప్రారంభిస్తామని కంపెనీ పేర్కొంది. ఇకపోతే ఆడి ఆర్ఎస్5 కూప్ మోడల్ టూ-డోర్ స్పోర్స్ కారు 4.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో 450 బిహెచ్‌పిల శక్తిని విడుదల చేస్తూ, కేవలం 4.2 సెకన్లలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇది గరిష్టంగా గంటకు 180 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది.


Click it and Unblock the Notifications








