క్యూ5లో చౌక రకం ఎస్‌యూవీని విడుదల చేసిన ఆడి

Audi Q5
జర్మనీకు చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి భారత మార్కెట్లో అందిస్తున్న ప్రీమియం ఎస్‌యూవీ (స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్) క్యూ5లో ఓ చౌక రకం వేరియంట్‌ను ప్రవేశపెట్టింది. 2.0 టిడిఐ క్వాట్రో ఇంజన్ కలిగిన బిజినెస్ ఎడిషన్‌ క్యూ5 ఎస్‌యూవీని ఆడి ఇండియా విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో దీని ధర రూ. 35,13,000 (ఎక్స్‌-షోరూమ్ ముంబై)గా నిర్ణయించినట్లు కంపెనీ పేర్కొంది. భారత మార్కెట్లో ప్రస్తుతం తాము అందిస్తున్న కార్లలోకెల్లా ఇదే అత్యంత చౌవకైనది ఆడి తెలిపింది.

ఈ ఏడాది అక్టోబర్‌ నెల నుంచి ఇది మార్కెట్లో అందుబాటులోకి రానుంది. లగ్జరీ ఎస్‌యూవీ సెగ్మెంట్లో తమ లీడర్‌షిప్ స్థానాన్ని మరింత బలోపేతం చేసేందుకు కొత్త ఆడి క్యూ5 2.0 టిడిఐ క్యూ ఖచ్చితంగా ఉపకరిస్తుందని ఆడి ఇండియా హెడ్‌ మైఖేల్‌ ప్రెస్కీ అన్నారు. సరసమైన ధరకే అందుబాటులోకి రానున్న సరికొత్త ఆడి క్యూ5 భారత వినియోగదారులకు ఆకట్టుకోగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం మార్కెట్లో లభ్యమవుతున్న క్యూ5 ఎస్‌యూవీ ధరలు రూ. 39.06 లక్షల నుంచి రూ. 45.12 లక్షల వరకు (ఎక్స్‌ షోరూమ్, మహారాష్ట్ర) ఉన్నాయి.

సరికొత్త బిజినెస్ ఎడిషన్ ఆడి క్యూ5 ఎస్‌యూవీ 17ఇంచ్ అల్లాయ్ వీల్స్, జెనాన్-ప్లస్ హెడ్‌లైట్స్, డే టైమ్ రన్నింగ్ ఎల్ఈడి లైట్స్, లెథర్ ఇంటీరియర్స్, బహుళ ఫీచర్లు కలిగిన 4-స్పోక్ లెథర్ స్టీరింగ్ వీల్ వంటివి ఇందులో ప్రధాన ఫీచర్లు. కాన్సెర్ట్ రేడియాతో కూడిన ఆడి మీడియా ఇంటర్‌ఫేస్, స్టోరేజ్ ప్యాకేజ్, రియర్ పార్కింగ్ ఎయిడ్ ఇందులో ప్రధాన ఆకర్షణగా నిలువనున్నాయి.

ఇక ఇంజన్ విషయానికి వస్తే.. క్యూ5లో అమర్చిన 2.0 టిడిఐ ఇంజన్ 125 కెడబ్ల్యూల, 170 హెచ్‌పి(హార్స్ పవర్)ల శక్తిని మరియు 350 ఎన్ఎమ్ (న్యూటన్ మీటర్)ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది 7-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తుంది. కొత్త ఆడి క్యూ5 సగటున ప్రతి లీటరుకు 12.80 కి.మీ. మైలేజీనిస్తుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, August 24, 2011, 11:23 [IST]
English summary
Audi India has unveiled a new cheaper Q5 sports utility vehicle (SUV). This new car is aimed at the business class and costs Rs.35.13 lakh (Ex-showroom price Mumbai). The new premium SUV is powered by a 2.0-litre diesel engine.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+