భారత్‌లో ఏ8 ఎల్ సెడాన్‌ను విడుదల చేసిన ఆడి

ఏ8 ఎల్ కారును ఆడి ఇండియా హెడ్ మైఖేల్ ప్రెష్కీ దేశీయ మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ కారుకు ఇప్పటికే 20 ఆర్డర్లు కూడా వచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ కారు కేవలం 4.7 సెకన్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఎనిమిది గేర్లతో లభించే ఈ కారులో డ్రైవింగ్ పూర్తిగా ఓ స్పోర్ట్స్ కారును నడుపుతున్న అనుభూతిని కల్పిస్తుందని కంపెనీ వివరించింది.
ఇంకా ఇందులో అడ్జస్టబుల్ ఫ్రంట్ అండ్ రియర్ సీట్స్, కమ్యూనికేషన్ సిస్టమ్స్, బ్లూటూత్, సన్ రూఫ్, ఫ్రంట్ సీట్లపై రెండు మోనిటర్లు, ఆకర్షనీమైన ఇంటీరియర్స్, కాంతివంతమైన లైటింగ్ వంటి ఎన్నో విలాసవంతమైన ఫీచర్లు ఉన్నాయి. దేశీయ విపణిలో ఆడి ఏ8 ఎల్ ధర రూ. 1.26 కోట్లు (ఎక్స్-షోరూమ్ మహారాష్ట్ర)గా ఉంది.


Click it and Unblock the Notifications








