భారత మార్కెట్లో ఆడి క్యూ5 ఎస్‌యూవీ కారు విడుదల

భారత్‌లో వృద్ధి చెందుతున్న లగ్జరీ కార్ మార్కెట్లో తమ వాహనం ద్వారా మార్కెట్ పరిమాణాన్ని పెంచుకోగలమని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తుంది. ఆడి క్యూ5 కారు 2.0 టిఎప్ఎస్ఐ క్యూ పెట్రోల్ ఇంజన్ 3.0 టిడిఐ క్యూ డీజిల్ ఇంజన్ ఆఫ్షన్లలో లభిస్తుంది. ఆడి క్యూ5 2.0 టిడిఐ క్వెట్టారో కారు సికెడిగా సరఫరా చేయబడుతుంది. 2010 సంవత్సరంలో ఆడి ఇండియా తమ విక్రయాలలో 81 శాతం వృద్ధిని సాధించి 3003 కార్లను విక్రయించింది.
దేశీయ మార్కెట్లో వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా కార్లను అందిస్తామని ఇండియా హెడ్ మైఖేల్ ప్రెస్కీ చెప్పారు. భారత్‌లో తమ డీలర్‌షిప్ నెట్‌వర్క్‌ను మరింత విస్తరించనున్నామని ఆయన తెలిపారు. ప్రస్తుతం భారత్‌లో ఆడి ఏ4, ఆడి ఏ6, ఆడి ఏ8, ఆడి క్యూ5, ఆడి క్యూ7, ఆడి టిటి, ఆడి ఆర్8 స్పోర్ట్ వెర్షన్ మరియు ఆడి ఆర్8 స్పైడర్ కార్లు అందుబాటులో ఉన్నాయి.


Click it and Unblock the Notifications








