భారత లగ్జరీ కార్ మార్కెట్లో అగ్రస్థానమే లక్ష్యం: ఆడి ఇండియా

అంతే కాకుండా.. ఆడి ఏ-సిరీస్‌లో భాగంగా ఏ8, ఏ7, ఏ6 కార్లను ఈ సంవత్సరం దేశీయ మర్కెట్లో విడుదల చేసి భారత్‌లో తమ మార్కెట్ వాటాను 23-25 శాతానికి పెంచుకోవాలని కంపెనీ సన్నాహాలు చేస్తుంది. వెడల్పాటి చక్రాల (వీల్ బేస్)తో తయారుచేసిన ఆడి ఏ8, మరో రెండు వారాల్లో విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నామని, ఆడి ఏ7 మోడల్ కారును ఈ ఏడాది మే లేదా జూన్ నెలలో, అలాగే ఆడి ఏ6ను ఈ ఆర్థిక సంవత్సర చివరి త్రైమాసికంలో విడుదల చేస్తామని ఆయన తెలిపారు.
భారత మార్కెట్లో లగ్జరీ కార్ల విభాగంలో ఉన్న పోటీని ఎదుర్కునే విధంగా ఈ కార్లను రూపొందించినట్లు పెష్కీ తెలిపారు. చైనా, జపాన్ దేశాలలో ఆడి నంబర్ వన్ స్థానంలో ఉందని, అలాగే.. అమెరికా, భారత్‌లలో అగ్ర స్థానాన్ని చేరుకోవడానికి కంపెనీ ప్రయత్నిస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం దేశీయ లగ్జరీ కార్ విభాగంలో ఆడి బ్రాండ్‌కు 20 శాతం వాటా ఉంది. 2010లో 3003 ఆడి కార్లను విక్రయించగా 2011లో కనీసం 4500 కార్లను విక్రయించాలని సంస్థ లక్ష్యంగా నిర్ణయించుకుంది.
ఇందుకు గానూ..ప్రస్తుతం 14గా ఉన్న డీలర్‌షిప్ కేంద్రాలను లుథియానా, నాగ్ పూర్, ఇండోర్, సూరత్‌లతో కలిపి 20కు విస్తరించనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఔరంగాబాద్‌లో ఉన్న ఆడి యూనిట్ ఏ4, క్యూ6, క్యూ5 శ్రేణి కార్లను అసెంబ్లింగ్ చేస్తుంది. ఈ ప్లాంటు ఉత్పత్తి సామర్థ్యం 4,500-5,000 యూనిట్లుగా ఉంది. రానున్న మూడేళ్లలో ఈ ఉత్పత్తి సామర్థ్యం రెండింతలకు పెరగవచ్చునని పెష్కీ ఆశాభావం వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications








