ఆడి ఆర్8 స్పైడర్ ఇప్పుడు భారత మార్కెట్లో..!

Audi R8
జర్మనీకు చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి భారత్ మార్కెట్లో మరో విలాసవంతమైన కారును విడుదల చేసింది. ఆడి అందిస్తున్న ఆర్8 సిరీస్‌లో "ఆర్8 స్పైడర్" అనే లగ్జరీ కారును దేశీయ వినియోగదారులకు పరిచయం చేసింది. 4.2 ఎఫ్ఎస్ఐ ఇంజన్ కలిగిన ఆడి ఆర్8 స్పైడర్ కారు 8,000 ఆర్‌పిఎమ్ వద్ద 525 బిహెచ్‌పి శక్తిని విడుదల చేస్తుంది. ఇది సిక్స్-స్పీడ్ సీక్వెన్షియల్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ (గేర్లు)తో కేవలం 4.6 సెకన్లలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

గంటకు 301 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించే ఈ కారు అర్బన్ ప్రాంతాల్లో లీటరుకు 4.9 కిలోమీటర్ల మైలేజ్‌ను, ఎక్స్‌ట్రా-అర్బన్ ప్రాంతాల్లో లీటరుకు 10.4 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఇక దీని ధర విషయానికి వస్తే.. 1,47,22,000 (ఎక్స్-షోరూమ్ మహారాష్ట్ర)గా ఉంది. ఈ ఏడాది జవరిలో కూడా కంపెనీ "ఆర్8 వీ10" అనే ఓ లగ్జరీ కారును విడుదల చేసిన సంగతి తెలిసిందే. భారత లగ్జరీ కార్ మార్కెట్లో ప్రథమ స్థానాన్ని ఆక్రమించుకునేందుకు ఆడి ఇండియా పోటీ పడుతుంది.

ఈ నేపథ్యంలో ఇక్కడ తమ ఉత్పత్తుల శ్రేణిని విస్తరించే అంశంపై కంపెనీ దృష్టి సారిస్తోంది. ప్రస్తుతం దేశీయ లగ్జరీ కార్ మార్కెట్లో బిఎమ్‌డబ్ల్యూ మొదటి స్థానంలోనూ, మెర్సిడెస్ బెంజ్ రెండవ స్థానంలోనూ ఉండగా... ఆడి మూడవ స్థానంలో ఉంది. ఈ విభాగంలో తమ స్థిరత్వాన్ని మరింత పటిష్టం చేసుకోవడంతో పాటు నంబర్ వన్ స్థానాన్ని చేరుకునేందుకు కంపెనీ కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ ఏడాది తొలి మూడు నెలల్లోనే కంపెనీ మూడు కొత్త మోడల్ కార్లను భారత్‌లో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.

More from DriveSpark

Article Published On: Saturday, March 26, 2011, 15:52 [IST]
English summary
Germany based luxury car maker Audi launched the all new R8 Spyder in the Indian market at price of Rs 1,47,22,000 (ex-showroom, Maharashtra). The new Audi R8 Spyder comes with a 4.2 FSI engine with a R Tronic six-speed sequential manual transmission.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+