ఈ దశాబ్దంలో 30,000 కార్లను విక్రయించాలనుకుంటున్న ఆడి

భారత మార్కెట్లో 2020 నాటికి తమ విక్రయాల సంఖ్య 25,000 - 30,000 యూనిట్లకు చేరుకుని, టాప్ టెన్‌లో ఒకటి కాగదలని కంపెనీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. 2010లో ఆడి పూర్తి అనుబంధ సంస్థ అయిన ఆడి ఇండియా 3003 కార్లను విక్రయించి గతేడాదితో పోలిస్తే 18 శాతం వృద్ధిని సాధించింది. ఈ సంఖ్య 2011లో 4,500 యూనిట్లకు, అలాగే 2015లో 15,000 యూనిట్లకు చేరుకోగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. కేంద్ర బడ్జెట్ 2011లో సికెడి యూనిట్లపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మరోసారి పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందని ఆడి పేర్కొంది.


Click it and Unblock the Notifications








