లీటరుకు 100 కి.మీ. మైలేజీనిచ్చే ఆడి ఏ3 సెడాన్!

లీటరుకు 100 కిలోమీటర్ల మైలేజీనిచ్చే విధంగా తీర్చిదిద్దిన ఏ3 సెడాన్‌ను 2012లో కంపెనీ మార్కెట్లో అధికారికంగా విక్రయించనుంది. ఇటీవల చైనాలో జరిగిన షాంగై ఆటో షోలో 2012 ఆడి ఏ3 సెడాన్ కారును కంపెనీ ఆవిష్కరించింది. ఇది డీజిల్ ఇంజన్‌తో నడిచే ఓ చిన్న సైజు సెడాన్ కారు. ఈ డీజిల్ ఇంజన్‌లో ఉపయోగించిన అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఈ మైలేజ్‌ను సాధించవచ్చని కంపెనీ పేర్కొంది.
ఆడి ఏ3 సెడాన్‌లో సిలిండర్ డీయాక్టివేషన్ టెక్నాలజీని ఉపయోగించారు. దీని వలన కారు నిర్ధిష్ట వేగంలో ప్రయాణిస్తున్నప్పుడు నాలుగు సిలిండర్లలో రెండు సిలిండర్లు స్విచ్ ఆఫ్ అయ్యి కారు వేగానికి సరిపోయే శక్తిని మాత్రమే అందిస్తాయి. తద్వారా ఇంధనం అదా అవుతుందని కంపెనీ వెల్లడించింది. గతంలో ఈ టెక్నాలజీ ప్రిమీయం కార్లలో మాత్రమే అందుబాటులో ఉండేది.
ఈ సిలిండర్ డీయాక్టివేషన్ టెక్నాలజీ కారణంగా కారును నిర్ధిష్టంగా గంటకు 50 కి.మీ. వేగంతో నడిపినట్లయితే 100 కిలోమీటర్ల మైలేజీని పొందవచ్చని కంపెనీ పేర్కొంది. ఆడి ఏ3లో అమర్చిన 1.4 లీటర్ డీజిల్ ఇంజన్ 138 బిహెచ్‌పిల గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుంది. 2012లో యూరప్, అమెరికా మార్కెట్లలో ఆడి ఈ కారును విడుదల చేయవచ్చని అంచనా. అయితే, భారత్‌కు రావచ్చనే కథనాలు కూడా ఉన్నాయి.


Click it and Unblock the Notifications








