ఆడి లగ్జరీ కార్లపై మనసుపడుతున్న భారతీయ మహిళలు

Audi
లగ్జరీ కార్లంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పండీ..! మన దేశంలో లగ్జరీ కార్లకు ఇటీవలి కాలంలో భారీ డిమాండే ఏర్పడింది. లగ్జరీ కార్లను కొనుగోలు చేయడానికి పురుషుల కంటే కూడా స్త్రీలే ఎక్కువ మక్కువ చూపుతున్నారని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇప్పటికే భారత లగ్జరీ కార్ మార్కెట్లో ఎంతో మంది విదేశీ తయారీదారులు తమ కొత్త ఉత్పాదనలను భారతీయ అవసరాలను అనుగుణంగా తీర్చిదిద్ది మార్కెట్లో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం భారత లగ్జరీ కార్ల విభాగంలో బిఎమ్‌డబ్ల్యూ అగ్రగామిగా ఉంది. బిఎమ్‌డబ్ల్యూకు సమీప పోటీదారుగా మెర్సిడెస్ బెంజ్ గట్టి పోటీ ఇస్తుంది. తాజాగా ఈ జాబితాలోకి ఆడి సంస్థ కూడా చేరిపోయింది.

భారత్‌లో మధ్యతరగతి ఎగువ కుటుంబాలలో ఉన్న స్త్రీలు లగ్జరీ కార్లపై ఎక్కువగా ప్రీతి కనబరుస్తున్నారని బిజినెస్ లైన్ నివేదిక పేర్కొంది. భాలీవుడ్ నటీ, నటులు కత్రినా ఖైఫ్, రణ్‌బీర్ కపూర్ వంటి ఆడి ఆర్8 కార్లను కలిగి ఉన్న ప్రముఖుల పేర్లను కూడా ఆ నివేదిక ప్రచురించింది. లగ్జరీ డ్రైవ్ కోరుకునే స్త్రీలు స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాలను (ఎస్‌యూవీ) ఎక్కువగా కొనుగోలు చేస్తుండటం పట్ల ఆడి ఇండియా హెడ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 2010లో ఆడి ఇండియా 60 శాతం వృద్ధిని సాధించి 3,000 యూనిట్లను విక్రయించిందని, లగ్జరీ కార్ లవర్స్ కోసం ఈ ఏడాది సరికొత్త మోడళ్లు అందుబాటులోకి రానున్నాయని ఆయన పేర్కొన్నారు.

More from DriveSpark

Article Published On: Tuesday, February 22, 2011, 13:54 [IST]
English summary
There has been a craze and passion to own a luxury car and the Indian luxury car market has the potential to feed the global players like BMW and Mercedes. Now Audi joins this elite club as more women go in for this car with the upper middle class family opting for a luxury car at its will.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+