ఏప్రిల్ ఆటోమొబైల్ ఎగుమతులలో 30 శాతం వృద్ధి

Bikes
ఏప్రిల్‌ నెలలో మొత్తం వాహనాల ఎగుమతులు 29.62 శాతం వృద్ధిని కనబరిచాయి. ఈ నెలలో ఆటోమొబైల్ కంపెనీలు మొత్తం 2,61,234 వాహనాలను ఎగుమతి చేసినట్లు భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (ఎస్ఐఏఎమ్) విడుదల చేసిన గణాంకాలు వెల్లడిస్తున్నాయ. గత ఏడాది ఇదే సమయంలో దేశీయ ఆటో ఎగుమతులు 2,01,543 యూనిట్లుగా ఉన్నాయి.

కాగా.. గత నెల ఎగుమతులలో ద్విచక్ర వాహనాలే అధికంగా ఉన్నాయి. దేశపు రెండవ అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో 1,26,264 యూనిట్లను ఎగుమతి చేయగా, టీవీఎస్‌ మోటర్ కంపెనీ 10,769 యూనిట్లను ఎగుమతి చేశాయి. అలాగే ప్యాసింజర్‌ కార్ల ఎగుమతుల్లో హ్యుందాయ్ 13.17 శాతం తగ్గుదలను కనబరిచి 20,422 యూనిట్లను ఎగుమతి చేయగా, మారుతి సుజుకీ 24.10 శాతం క్షీణించి 9,819 యూనిట్లను విక్రయించింది.

అయితే కొత్తగా మార్కెట్‌లోకి వచ్చిన నిస్సాన్‌ మాత్రం 9,431 యూనిట్లు ఎగుమతులు చేసింది. గత ఏడాది నిస్సాన్‌ అస్సలు ఎగుమతులను ప్రారంభించలేదు. అలాగే.. ఫోర్డ్‌ ఇండియా ఎగుమతుల్లో ఏడు రెట్లు పెరిగి 1,167 యూనిట్లుగా ఉండగా, టాటా మోటార్స్ ఎగుమతుల్లో రెండు రెట్ల వృద్ధితో 1,041 వాహనాలు ఎగుమతి అయ్యాయి. ఇక వాణిజ్య వాహనాల విషయానికి వస్తే.. ఇవి 36.01 శాతం వృద్ధితో 5,246 యూనిట్లు ఎగుమతలు జరిగాయి. గతేడాది ఇవి 3,857 వాహనాలు మాత్రమే.

More from DriveSpark

Article Published On: Tuesday, May 10, 2011, 11:01 [IST]
English summary
Car manufacturing plantLed by the two-wheeler segment, the country's overall vehicles exports during April surged by 29.62% at 2,61,234 units, Society of Indian Automobile Manufacturers (SIAM) today said. Vehicle makers exported 2,01,543 units from the country in the corresponding period last year, SIAM said.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+