పన్నుల భారం తగ్గించండి మహాప్రభో..: ఆటో కంపెనీల గోడు

Auto Industry
మరికొద్ది రోజుల్లో బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో.. ఈసారి బడ్జెట్‌లో ప్రభుత్వం ఎక్సైజ్, పన్నులను పెంచవచ్చని వినిపిస్తున్న వార్తలపై ఆటోమొబైల్ కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ పరిస్థిని అర్థం చేసుకున్న ఆటో కంపెనీలు ప్రభుత్వానికి తమ విన్నపాలు వినిపించుకునేందుకు సిద్ధమయ్యాయి. ఎక్సైజ్ డ్యూటీని తగ్గించడంతో పాటు పెద్దకార్లపై అధనంగా విధించిన రూ. 15,000 పన్నును కూడా తొలగించి పన్ను విషయంలో చిన్నకార్లకి పెద్దకార్లకు మధ్య వత్యాసాన్ని సరళతరం చేయాల్సిందిగా ఆటోమొబైల్ కంపెనీలు ప్రభుత్వం ముందు తమ అభ్యర్ధనలను ఉంచనున్నాయి.

ప్రస్తుతం పెద్దకార్ల (1,500 సీసీకు మించి ఇంజన్ సామర్థ్యం కలిగిన కార్ల)పై 22 శాతం ఎక్సైజ్ డ్యూటీతో పాటు అధనంగా రూ. 15,000 పన్నును ప్రభుత్వం వసూలు చేస్తుంది. వాహనం నాలుగు మీటర్ల కన్నా పొడవు కలిగి ఉండి పెట్రోల్ ఇంజన్ సామర్థ్యం 1,200 సీసీ మరియు డీజిల్ ఇంజన్ సామర్థ్యం 1,500 సీసీలకు మించి ఉన్న కార్లను పెద్దకార్లుగా గుర్తించడం జరుగుతుంది. వీటికన్నా తక్కువ ఉన్న వాటిని చిన్నకార్లుగా గుర్తించడం జరుగుతుంది. ప్రస్తుతం చిన్నకార్లపై 10 శాతం ఎక్సైజ్ సుంకాన్ని ప్రభుత్వం వసూలు చేస్తుంది.

మరోవైపు దిగుమతి చేసుకున్న కార్లపై కూడా.. ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్న కస్టమ్ డ్యూటీ విధానాన్ని మార్చాలని ఆటో పరిశ్రమ కోరుకుంటుంది. ఇలా చేయడం వల్ల ప్రభుత్వం దేశీయ ఆటో పరిశ్రమను రక్షించడంతో పాటు.. భారత్‌లో ఉన్న కార్ల తయారీదారులను ప్రోత్సహించినట్లు అవుతుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ప్రతి బడ్జెట్ సమావేశాలకు ముందు భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (ఎస్ఐఏఎమ్) ప్రభుత్వానికి తమ నివేదికను సమర్పిస్తుంది.

ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా ఎస్ఐఏఎమ్ తమ నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. అయితే దీనిపై స్పందించేందుకు మాత్రం ఎస్ఐఏఎమ్ అధికారులు నిరాకరించారు. గతేడాది మార్కెట్ అనుకూలంగా ఉండటంతో దేశీయ ఆటోమొబైల్ రంగం మార్కెట్ అంచనాలను తలకిందులు చేస్తూ.. 30 శాతం వృద్ధిని కనబరిచిన సంగతి తెలిసిందే..! మరి ఈ ఏడాది ఆటో పరిశ్రమ వృద్ధిపై ప్రభుత్వ నిర్ణయం ఏ విధమైన ప్రభావాలను చూపనుందో కాలమే నిర్ణయించాలి.

More from DriveSpark

Article Published On: Tuesday, February 15, 2011, 14:03 [IST]
English summary
Car manufacturing plant Ahead of the Budget, the auto industry is understood to have asked the government to reduce excise duty and remove the additional Rs 15,000 tax imposed on big cars to minimise the gap with those of small cars.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+