బడ్జెట్ 2011 - పన్నుల పెంపుపై ఆటోమొబైల్ పరిశ్రమ ఆందోళన

ఒకవేళ ప్రభుత్వం ఇదే కనుక చేస్తే ఆ భారాన్ని కంపెనీలు మోయకుండా.. వినియోగదారలపై రుద్దేందు ప్రయత్నిస్తారు. ఫలితంగా ఆటో రంగం జోరుకు బ్రేక్ పడి అమ్మకాలు సన్నగిల్లే ఆస్కారం ఉంది. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది బడ్జెట్‌లో వాహన రంగం ప్రభుత్వాన్ని పెట్టుకుంటున్న అర్జీలు ఇవి...
ఎక్సైజ్ డ్యూటీని తగ్గించడంతో పాటు పెద్దకార్లపై అధనంగా విధించిన రూ. 15,000 పన్నును కూడా తొలగించి, పన్ను విషయంలో చిన్నకార్లకి పెద్దకార్లకు మధ్య వత్యాసాన్ని సరళతరం చేయాలి. ప్రస్తుతం పెద్దకార్ల (1,500 సీసీకు మించి ఇంజన్ సామర్థ్యం కలిగిన కార్ల)పై 22 శాతం ఎక్సైజ్ డ్యూటీతో పాటు అధనంగా రూ. 15,000 పన్నును ప్రభుత్వం వసూలు చేస్తుంది. వాహనం నాలుగు మీటర్ల కన్నా పొడవు కలిగి ఉండి పెట్రోల్ ఇంజన్ సామర్థ్యం 1,200 సీసీ మరియు డీజిల్ ఇంజన్ సామర్థ్యం 1,500 సీసీలకు మించి ఉన్న కార్లను పెద్దకార్లుగా గుర్తించడం జరుగుతుంది.
వీటికన్నా తక్కువ ఉన్న వాటిని చిన్నకార్లుగా గుర్తించడం జరుగుతుంది. ప్రస్తుతం చిన్నకార్లపై 10 శాతం ఎక్సైజ్ సుంకాన్ని ప్రభుత్వం వసూలు చేస్తుంది. మరోవైపు దిగుమతి చేసుకున్న కార్లపై కూడా.. ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్న కస్టమ్ డ్యూటీ విధానాన్ని మార్చాలని ఆటో పరిశ్రమ కోరుకుంటుంది. ఇలా చేయడం వల్ల ప్రభుత్వం దేశీయ ఆటో పరిశ్రమను రక్షించడంతో పాటు.. భారత్‌లో ఉన్న కార్ల తయారీదారులను ప్రోత్సహించినట్లు అవుతుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
ఇంకా.. సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ (సీఎస్‌టీ)ను తగ్గించాలనేది భారతీయ వాహన విడిభాగాల తయరీసంస్థల సంఘం (ఏసీఎమ్ఏ) ప్రధాన డిమాండ్. వీలైనంత వేగంగా వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ)ను ప్రవేశపెట్టాలి. లేనట్లయితే సీఎస్‌టీని పూర్తిగా తొలగించడం లేదా 1 శాతానికి తగ్గించాలనేది వారి విన్నపం. మరి వీటిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో మరికొద్ది రోజుల్లోనే తేలనుంది.


Click it and Unblock the Notifications








