కార్లపై ఇటు చమురు, అటు బ్యాంకుల ఉక్కుపాదం

ఇప్పటికే అమ్మకాలు లేక సతమవుతున్న ఆటోమొబైల్ కంపెనీలపై పెరిగిన ఇంధన, వడ్డీ రేట్ల ప్రభావం భారీగా పడనుంది. పెట్రోల్ ధరల పెంపు కారణంగా డీజిల్ కార్ల వినియోగం పెరిగి, డీజిల్ కార్లకు డిమాండ్ పెరుగుతుంది. మరోవైపు ఆర్‌బిఐ వడ్డీరేట్ల వడ్డింపు కారణంగా వాహనాలకు రుణ సదుపాయాన్ని అందించే బ్యాంకులన్నీ కూడా వడ్డీ రేట్లను పెంచే ఆస్కారం ఉంది. ఇలా ఆర్‌బిఐ వడ్డీ రేట్లను పెంచడం గతేడాది మార్చి నుంచి ఇది 12వసారి.
ఈ నేపథ్యంలో కొనుగోలుదారులు, కొత్త వాహనాల కొనుగోలు విషయంలో వెనకడుగు వేసే అవకాశాలు ఉన్నాయి. అసలే ప్రస్తుత పండుగ సీజన్‌పై కోటి ఆశలు పెట్టుకున్న ఆటోమేకర్లకు ఇది దండగ సీజన్‌గా మారనుంది. ఇదివరకే పెరిగిన ఇంధన ధరలు, వడ్డీ రేట్ల కారణంగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఎన్నడూ లేనంతగా గడచిన ఆగస్టు నెలలో వాహన అమ్మకాలు పడిపోయాయి. ఈ నేపథ్యంలో కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు అమ్మకపుదారులు చేసే ప్రయత్నాలు ఎంత వరకూ విజయవంతమవుతాయో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications








