రీకాల్ సమస్యలతో సతమతమవుతున్న ఆటో కంపెనీలు

Recall
మనదేశంలో ప్రముఖ ఆటోమొబై‌ల్ అందిస్తున్న కొన్ని ప్రతిష్టాత్మక ఉత్పత్తులలో చిన్న చిన్న లోపాల కారణంగాస సదరు ఉత్పత్తులను కంపెనీలు వెనక్కు పిలిపించడాన్ని (రీకాల్) మనం తరచూ గమనిస్తూనే ఉన్నాం. కార్లను ఉత్పత్తి చేసే తయారీదారులు తమ ఉత్పత్తులో ఉపయోగించే విడిభాగాలలో దాదాపుగా అధిక భాగం ఇతర విడిభాగా తయారీదారుల నుంచి కొనుగోలు చేస్తారు.

కాగా.. వీటిలో ఒక్కోసారి నాణ్యతలేని విడిభాగాల కారణంగా ఆ సమయంలో ఉత్పత్తయిన కార్లలలో వివిధ సమస్యలు తలెత్తుంటాయి. తాజాగా.. మనదేశంలో హోండా కంపెనీ 72,000లకు 5005-07 మధ్య కాలంలో తయారైన సిటీ సెడాన్ కార్లను రీకాల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కాలంలో తయారైన కార్లలో నాసిరకమైన పవర్ విండోస్ స్విచ్‌ను ఉపయోగించిన కారణంగా, దీని ఆపరేటింగ్‌లో సమస్యలు తలెత్తుతున్నాయనే కారణంగా ఈ మోడళ్లను రీకాల్ చేసినట్లు కంపెనీ పేర్కొంది.

మనదేశంలోని ఆటోమొబైల్ కంపెనీలు ఇలా తమ కార్లను వెనక్కు పిలిపించడం ఇదేం మొదటిసారి కాదు. గడచిన నాలుగేళ్లలో వివిధ ప్రముఖ దేశీయ కంపెనీలు తమ కార్లను రీకాల్ చేశాయి. ఏప్రిల్ 2011లో మారుతి సుజుకి మొత్తం 13,157 కార్లను (స్విఫ్ట్, స్విఫ్ట్ డిజైర్, రిట్జ్) కార్లను రీకాల్ చేయగా, ఫిబ్రవరి 2011లో హోండా 57,853 సిటీ సెడాన్ కార్లను రీకాల్ చేసింది.

అలాగే, ఫిబ్రవరి 2010లో మారుతి సుజుకి లక్ష ఏ-స్టార్ కార్లను రీకాల్ చేస్తే, జనవరి 2010లో కూడా హోండా 8,532 సిటీ సెడాన్ కార్లను రీకాల్ చేసింది. ఇదే ఏడాదిలో అగ్ని ప్రమాదాల కారణంగా టాటా మోటార్స్ చిన్న కారు టాటా నానోను రీకాల్ చేయగా, ఆగస్టు 2008లో స్కొడా తన చిన్న కారు ఫ్యాబియాను రీకాల్ చేసింది.

కాగా.. హోండా రీకాల్ చేసిన మోడళ్లలో తన ఫ్లాగ్‌షిప్ మోడల్ అయిన సిటీ సెడాన్ కార్లే ఎక్కువగా ఉన్నాయి. దాదాపు అన్ని దేశాల్లోనూ ఈ రీకాల్ సమస్య ఆటో దిగ్గజాలను ఆందోళనకు గురిచేస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా అధికంగా వాహనాలను రీకాల్ చేసిన కంపెనీలలో జపాన్‌కు చెందిన ఆటో దిగ్గజం టొయోటా మోటార్ కార్పోరేషన్ ముందుంటుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, September 7, 2011, 12:42 [IST]
English summary
Leading auto majors are losing a lot due to Recall issues. Recently Honda has announced that it will be recalling more than 72,000 City sedans to rectify a defective switch in the car's power window system.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+