పెరుగుతున్న వడ్డీ రేట్లతో ఆటో, రియాల్టీ రంగాలపై భారం: ప్రణబ్

Pranab Mukherjee
పెరుగుతున్న వడ్డీ రేట్లతో దేశీయ ఆటోమొబైల్ మరియు రియల్ ఎస్టేట్ రంగాలు మరింతగా నష్టపోయే ఆస్కారం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. ప్రధానంగా వడ్డీ రేట్లపైనే ఆధారపడి పనిచేసే ఈ రెండు రంగాలు రానున్న రోజుల్లో మరింతగా క్షీణించే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆయన అన్నారు. ఈ రంగాల్లో వారికి రుణాలు మరింత భారం కావడం ప్రధాన సమస్యగా మారిందని ప్రణబ్ వ్యాఖ్యానించారు.

ఇతర రంగాలతో పోలిస్తే.. ఆటోమొబైల్ మరియు రియల్ ఎస్టేట్ రంగాలనే వడ్డీ రేట్ల పెంపు అధికంగా బాధిస్తోందని, ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు గడచిన మార్చి 2010 నుంచి భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బిఐ) ఇప్పటికే 11 సార్లు కీలక వడ్డీ రేట్లను సవరించిందని, అలాగే 325 బేసిస్‌ పాయింట్ల వరకూ రెపో, రివర్స్‌ రెపోలను సవరించిందని ప్రణబ్ తెలిపారు. లోక్‌సభకు లిఖితపూర్వక సమాధానమిచ్చిన ఆయన ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితుల్లో అధికంగా నష్టపోయే విభాగాల్లో బ్యాంకులు, ఐటి సెక్టార్‌ కూడా ఉన్నాయని అన్నారు.

More from DriveSpark

Article Published On: Saturday, August 20, 2011, 10:55 [IST]
English summary
Union Finance Minister Pranab Mukherjee said, interest-sensitive sectors like automobiles and real estate are likely to get affected more compared to other segments by rise in borrowing cost.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+