సెప్టెంబర్‌లో ఆటో అమ్మకాల జోరు పెరుగుంది: ఎస్ఐఏఎమ్

సెప్టెంబర్ మధ్య భాగం నుంచి అమ్మకాలు ఊపందుకునే ఆస్కారం ఉందని భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (ఎస్ఐఏఎమ్) పేర్కొంది. "పండుగ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో సెప్టెంబర్ నెల మధ్యలో మార్కెట్ ఊపందుకుంటుందని మేము అంచనా వేస్తున్నాం" అని ఎస్ఐఏఎమ్ మేనేజింగ్ డైరెక్టర్ విష్ణు మాథుర్ తెలిపారు.
మాథుర్ అభిప్రాయం ప్రకారం, భారత ఆటోమొబైల్ పరిశ్రమపై అధిక ఉత్పాదక వ్యయాలు, పెరిగిన ఇంధన ధరలు మరియు వడ్డీ రేట్లు తీవ్ర వత్తిడిని తెస్తుండటంతో కంజ్యూమర్ సెంటిమెంట్ దెబ్బతింటోంది. పెరిగిన వడ్డీ రేట్లు చిన్న తరహా మరియు మధ్య తరహా ఆటోమొబైల్ కంపెనీల విస్తరణ ప్రణాళికలపై కూడా ప్రభావాన్ని చూపుతున్నాయని ఆయన అన్నారు.
విస్తరణ ప్రణాళికల కోసం వాణిజ్య సంస్థల ద్వారా నిధులు సమకూర్చుకోవాల్సిన టైర్-1 మరియు టైర్-2 కంపెనీలు అత్యధికంగా ప్రభావితమైనట్లు ఆయన చెప్పారు. ఆగస్టు నెల అమ్మకాలపై మాథుర్ స్పందిస్తూ.. ఇప్పటికీ కొన్ని ప్రముఖ కంపెనీలు నుంచి డేటా రావాల్సి ఉందని, అయినప్పటికీ ఈ నెలలో వృద్ధి రేటు తక్కువగానే నమోదైందని అన్నారు.


Click it and Unblock the Notifications








