ఈ ఏడాది ఆటో పరిశ్రమకు కష్టాలు తప్పవు: ఆటో కంపెనీలు

Auto Industry
నానాటికీ పెరుగుతున్న ముడిసరుకుల ధరలు, బ్యాంకు వడ్డీ రేట్లు, ఇంధన ధరల ప్రభావం ఆటోరంగ అభవృద్ధిపై తీవ్ర ప్రభావాలను చూపుతున్నాయి. 2010లో మార్కెట్ అంచనాలను తలకిందులు చేస్తూ.. ఊహించని రీతిలో 31 శాతం అధిక వృద్ధిని సాధించిన భారతదేశ ఆటో రంగం ఈ ఏడాది మాత్రం 14-15 శాతానికి పడిపోవచ్చునని ఆటోపరిశ్ర మకు చెందిన ఒక ఉన్నతాధికారి వెల్లడించారు. 2009లో అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్యం ఏర్పడినప్పటికీ భారత్‌లో మాత్రం 23-24 శాతం వృద్ధిని సాధించింది.

అధిక నిర్వహణ వ్యయం, ఇంధన ధరల పెంపులకు తోడు పెరుగుతున్న వడ్డీ రేట్లు ఈ సంవత్సరం (2011) మొత్తం దేశీయ ఆటో పరిశ్రమ విక్రయాలపై ప్రభావం చూపుతుందని, అయితే.. తమపై మాత్రం పెద్దగా ప్రభావం చూపబోదని జనరల్‌ మోటార్స ఉపాధ్యక్షుడు (కార్పొరేట్‌ అఫైర్స్‌) ఎ బాలేంద్రన్‌ తెలిపారు. ఈ ఏడాది జనవరి నెలలో జనరల్ మోటార్స్ విక్రయాలు 6 శాతం పెరిగి 9,984 యూనిట్లను విక్రయించామని, గతేడాది ఇదే సమయంలో 9,421 యూనిట్లు విక్రయించామని.. అలాగే ఈ ఫిబ్రవరిలో విక్రయాలు ఇలాగే కొనసాగుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం మార్కెట్‌ సెంటిమెంట్‌ బలహీనంగా ఉండటం, ఆర్థికవృద్ధి రేటు మందగించడం, ద్రవ్యచలామణి (లిక్విడిటీ)ని కట్టడి చేయటం వంటివి ఆటో పరిశ్రమకు అనుకూలమైన అంశాలు కావని, వీటి ఫలితంగా ఉత్పత్తుల ధరలు పెరుగుతున్నాయని బాలేందర్ చెప్పారు. అంతేకాకుండా.. అంతర్జాతీయ మార్కెట్‌లో మూడి చమురు బ్యారెల్ ధర (క్రూడ్ ఆయిల్) 100 డాలర్లకు చేరువలో ఉండటం వల్ల మరోసారి ధరలు పెరుగువచ్చని ఆయన అంచనా వేశారు.

దేశంలోనే అతి పెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి కూడా వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆటో రంగం మంద గించవచ్చునని ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా అధిక ద్రవ్యోల్బణం, ధరల పెంపు, ఇంధన ధరలు ఆటో పరిశ్రమపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని కంపెనీ జనరల్‌ మేనేజర్‌ (మార్కెటింగ్‌) శశాంక్‌ శ్రీవాత్సవ ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే.

More from DriveSpark

Article Published On: Monday, February 14, 2011, 10:17 [IST]
English summary
Rising interest rates coupled with increasing fuel prices and input costs have the potential to affect the Indian auto sector''s growth which could slowdown at around 14-15 per cent in 2011 as compared to 31 percent in 2010, a top industry official has said.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+